Begin typing your search above and press return to search.

ఇది నా సోదరికి లేదా కొడుక్కి రానందుకు థాంక్స్!-సోనాలి బింద్రే

`మ‌న్మ‌ధుడు` బ్యూటీ సోనాలి బింద్రే చాలా కాలంగా లైమ్ లైట్ కి దూరంగా ఉన్నారు. దానికి కార‌ణం క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీ.

By:  Tupaki Desk   |   29 April 2024 2:45 AM GMT
ఇది నా సోదరికి లేదా కొడుక్కి రానందుకు థాంక్స్!-సోనాలి బింద్రే
X

`మ‌న్మ‌ధుడు` బ్యూటీ సోనాలి బింద్రే చాలా కాలంగా లైమ్ లైట్ కి దూరంగా ఉన్నారు. దానికి కార‌ణం క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీ. వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల్లోలంతోనే రంగుల ప్ర‌పంచానికి దూర‌మ‌య్యారు. ప్ర‌మాద‌క‌ర క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారీతో తీవ్రంగా పోరాడి ఆ త‌ర్వాత దాని నుంచి చివ‌రికి ఈ న‌టి కోలుకుంది. క్యాన్స‌ర్ చికిత్స కోసం కెరీర్ కి బిగ్ బ్రేక్ తీస్కుంది. చివ‌రికి 2022లో న్యూస్‌రూమ్ డ్రామా సిరీస్ `ది బ్రోకెన్ న్యూస్‌`తో తిరిగి వ‌చ్చింది. ఈ షో సీక్వెల్ మే 2024లో ZEE5లో ప్రీమియర్‌గా ప్రదర్శితం కానుంది. క్యాన్సర్‌తో తన పోరాటం గురించి సోనాలి తాజాప ప్రమోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో చాలా మాట్లాడింది. ఇప్పుడు మ‌రోసారి బాంబే పాడ్‌కాస్ట్ షోలో సోనాలి తనకు క్యాన్సర్ అని తెలిసాక త‌న మొద‌టి రియాక్ష‌న్ గురించి మాట్లాడింది. తన క్యాన్సర్ నిర్ధారణ వార్తను విన‌గానే.. నేనే ఎందుకు? అని మొదట ప్రశ్నించుకున్నాన‌ని గుర్తు చేసుకుంది.

ఇదంతా ఒక పీడకలగా భావించాను.. నాకే ఎందుకిలా అని నేను నమ్మలేకపోయాను. అప్పుడే నేను నా విధానాన్ని మార్చుకోవడం మొదలుపెట్టాను. నాకే ఎందుకు? అనే బదులు, నేనెందుకు కాదు? అని న‌న్ను నేను అడగడం మొదలుపెట్టాను. ఇది నా సోదరికి లేదా నా కొడుక్కి ఎదుర‌వ్వ‌లేదని నేను కృతజ్ఞతగా ఉన్నాను. దీన్ని ఎదుర్కోవడానికి నాకు బలం ఉందని, అత్యుత్తమ ఆసుపత్రులకు వెళ్లడానికి నాకు వనరులు ఉన్నాయని.. త‌ద్వారా నాకు సహాయం చేయడానికి సహాయక వ్యవస్థ ఉందని గ్రహించాను. ``నేనెందుకు కాదు?`` అని అడగడం ప్రారంభించాను. వైద్య ప్రక్రియను ప్రారంభించడంలో ఇది నాకు అన్నివిధాలా సహాయపడింది.

2018లో సోనాలికి నాలుగో దశ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటుపై న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంది. 2021లో క్యాన్సర్ రహితంగా కోలుకుంది. అప్పటి నుండి క్యాన్సర్ రోగుల‌కు మద్దతు ఇస్తోంది.. అవగాహన పెంచుతోంది. 2021లో క్యాన్సర్ సర్వైవర్స్ డే సందర్భంగా కూడా దీనిని పోస్ట్ చేసింది. సోనాలి ఇలా రాసింది. ``స‌మయం ఎలా ఎగురుతుంది... ఈ రోజు నేను వెనక్కి తిరిగి చూస్తే, నేను నాలో బలాన్ని చూస్తున్నాను.. నేను బలహీనతను చూస్తున్నాను.. ముఖ్యంగా నా జీవితం ఎలా ఉంటుందో అని నేను ఎదురు చూస్తున్నాను. అయితే మ‌నం ఎంచుకున్న జీవితాన్ని మ‌న‌మే సృష్టించుకోవాలి.. అని సోనాలి రాసింది. గ‌తంలో ఒక ఇంట‌ర్వ్యూలో సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న తర్వాత నటనపై తనకున్న ప్రేమ ఎలాంటిదో అది ఎలా గ్రహించిందో కూడా మాట్లాడారు. ``అనారోగ్యం మ‌న‌కు చాలా క్లారిటీని ఇస్తుంది.. నేను దీన్ని బ‌తికించాలనుకుంటున్నాను.. నేను బయటప‌డ్డాను.. ఇప్పుడు ఏం చేయబోతున్నాను?`` అని ప్ర‌శ్నించుకున్నాను. న‌ట‌న తప్ప మరేదీ చేయకూడదని నేను గ్రహించానని సోనాలి చెప్పింది.