Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : చౌహాన్‌ ఎరుపు అందాలు కన్నుల విందు

ఆ సినిమా నిరాశ పరచడంతో ఆరు ఏళ్ల వరకు టాలీవుడ్ లో సినిమాలు చేయలేదు.

By:  Tupaki Desk   |   29 Jun 2024 6:09 AM GMT
పిక్ టాక్‌ : చౌహాన్‌ ఎరుపు అందాలు కన్నుల విందు
X

2005 ఫెమినా మిస్ ఇండియా, మిస్ వరల్డ్‌ టూరిజం టైటిల్స్ ను గెలుచుకున్న ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్‌ బాలీవుడ్ సినిమా జన్నత్‌ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌ లో ఇంద్ర ధనస్సు సినిమాలో నటించింది. ఆ సినిమా నిరాశ పరచడంతో ఆరు ఏళ్ల వరకు టాలీవుడ్ లో సినిమాలు చేయలేదు.


బాలకృష్ణ లెజెండ్‌ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్‌ లో రీ ఎంట్రీ ఇచ్చిన సోనాల్‌ చౌహాన్ ఆ సినిమా హిట్‌ అవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. బ్యాక్‌ టు బ్యాక్‌ పెద్ద సినిమాల్లో ఆఫర్లు సొంతం చేసుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో సోనాల్‌ చౌహాన్‌ తక్కువ సమయంకే ఫేడ్‌ ఔట్‌ అయ్యింది.


సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం ద్వారా రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ గా ఆఫర్లు రాకున్నా కూడా అందాల ఆరబోత ఫోటోల కారణంగా వైరల్‌ అవుతూ ఉంది. మధ్య మధ్యలో సినిమాల్లో కూడా మెరుస్తూ వస్తుంది.

తాజాగా మరోసారి అందాల ఫోటో షూట్‌ ను షేర్ చేసింది. రెడ్‌ డ్రెస్ లో సోనాల్ చౌహాన్ అందాల విందు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టా లో సోనాల్‌ చౌహాన్ షేర్‌ చేసిన ఈ ఫోటోలు కన్నుల విందుగా ఉన్నాయంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రతి ఫోటో షూట్‌ లో కూడా చాలా విభిన్నంగా, అందంగా కనిపిస్తూ అలరిస్తున్న సోనాల్‌ చౌహాన్ కి సినిమా ఇండస్ట్రీలో దక్కాల్సిన గుర్తింపు మరియు స్టార్‌ డమ్‌ దక్కలేదు అంటూ ఆమె ఫాలోవర్స్ ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.