Begin typing your search above and press return to search.

యోగా చేస్తూ, బాడీని విల్లులా వంచేస్తున్న సోనాల్..!

తాజాగా, యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూస్తుంటే ఎవరైనా నోరు పెట్టాల్సిందే.

By:  Tupaki Desk   |   25 Aug 2023 2:45 AM GMT
యోగా చేస్తూ, బాడీని విల్లులా వంచేస్తున్న సోనాల్..!
X

హీరోయిన్లు తమ బాడీని చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. దాని కోసం వారు కఠిన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. జిమ్ ల వెంట పరుగులు తీస్తారు. అంతేనా యోగాలు కూడా చేస్తూ ఉంటారు. దాని వల్లే వారి నడుము నాజుకుగా ఉంటుంది. స్ప్రింగ్ లా ఎలా కావాలంటే అలా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్ కూడా అదే చేస్తోంది.


సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే సోనాల్, అప్పుడుప్పుడు తన ఫోటోలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా, యోగా చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూస్తుంటే ఎవరైనా నోరు పెట్టాల్సిందే. శరీరం మొత్తాన్ని విల్లులా వంచేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


ఇక, సోనాల్ కెరీర్ విషయానికి వస్తే, టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. వాటిలో చాలా వరకు హిట్ అయ్యాయి. కానీ, సోనాల్ కే ఇంకా స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోలేకపోయింది. తెలుగులో చాలా మంది హీరోలతో నటిచింది కానీ, బాలకృష్ణ చిత్రాల ద్వారానే సోనాల్ చౌహాన్‌కు మంచి గుర్తింపు వచ్చింది.


లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాలలో సోనాల్ ఆకట్టుకున్నారు. మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె హిందీ సినిమా జన్నత్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. 2008లో 'రైన్ బో' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ మూవీలో ఓ చిన్న రోల్ లో కనిపించారు. సోనాల్ సినిమాల సంగతి ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా మంచి క్రేజ్ ఉంది.


సోనాల్ కి కేవలం ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 5 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక, సోనాల్ సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తే, కుర్రాళ్లకు నిద్రపట్టదు అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోజులతో మతి పోగొడుతూ ఉంటుంది. అప్పుడుప్పుడు బికినీ ట్రీట్ ఇస్తూ, తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని ఖుషీ చేస్తూ ఉంటుంది.