Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బ్లాక్ అండ్‌ వైట్‌లో అందాల సోనం

వెంకటేష్ హీరోగా వచ్చిన 'బాబు బంగారం' సినిమాలో ప్రత్యేక పాటలో మెరిసిన ముద్దుగుమ్మ సోనం ప్రీత్‌ బజ్వా.

By:  Tupaki Desk   |   21 March 2025 1:00 AM IST
SonamBajwa in jeans and white top
X

                                                                                      సోనమ్ బజ్వా ఫాషన్

వెంకటేష్ హీరోగా వచ్చిన 'బాబు బంగారం' సినిమాలో ప్రత్యేక పాటలో మెరిసిన ముద్దుగుమ్మ సోనం ప్రీత్‌ బజ్వా. తెలుగులో ఆ వెంటనే ఆటాడుకుందాం రా సినిమాలోనూ నటించింది. కానీ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో ఆ తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు. తెలుగులో ఒకటి రెండు చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా పెద్దగా స్పందించలేదని సమాచారం. తెలుగు సినిమాల్లో కంటే ఎక్కువగా నార్త్‌ ఇండియన్‌ సినిమాల్లో ఆసక్తి చూపించింది. పంజాబీ, హిందీ సినిమాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న సోనం బజ్వా సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంది. ఆకట్టుకునే అందంతో పాటు ఫోటో జనిక్ ఫేస్‌ కావడంతో సోనం ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ ఉంటాయి.

సోనమ్ బజ్వా ఫాషన్

2012 మిస్ ఇండియా కాంటెస్ట్‌లో పాల్గొన్న సోనంకు సినిమాల్లో ఆఫర్లు దక్కాయి. 2013లో పంజాబీ సినిమా బెస్ట్‌ ఆఫ్ లక్‌ లో నటించడం ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా పర్వాలేదు అనిపించుకుంది. పంజాబీ సినిమాల్లో నటించిన సోనం ఆ తర్వాత తమిళ్ మూవీలో నటించింది. తమిళ్‌లో ఈమె నటించిన సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దాంతో మళ్లీ తమిళ్‌లో నటించే అవకాశం దక్కలేదు. ముందు ముందు అయినా ఈమె తమిళ్‌లో నటిస్తుందా అనేది చూడాలి. సౌత్‌ ఇండియాలో ఈమె సినిమాలు పెద్దగా ఆడకున్నా, సౌత్‌ భాషల్లో నటించకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు సౌత్‌ ఇండియన్‌ ప్రేక్షకులు చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు.

సోనమ్ బజ్వా ఫాషన్

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 14 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సోనం బజ్వా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. ప్రతి హీరోయిన్‌ స్కిన్‌ షో చేస్తూ అందాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. కానీ వారితో పోల్చితే సోనం బజ్వా ఫోటోలు విభిన్నంగా ఉంటాయి. పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా క్రియేటివ్‌ ఐడియాలతో సోనం ఫోటో షూట్స్ ఉంటాయని అంతా కామెంట్‌ చేస్తూ ఉంటారు.

అందంగా కనిపించడం ఒక ఎత్తు అయితే, ఆ అందంను క్రియేటివ్‌గా చూపించడం మరో ఎత్తు అంటూ ఉంటారు. తాజాగా సోనం ఫోటో షూట్‌ను బ్లాక్ అండ్ వైట్‌ లో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. బ్లాక్ అండ్‌ వైట్‌లోనూ ఇంత అందంగా కనిపిస్తారా అంటూ చాలా మంది సర్‌ప్రైజ్ అవుతున్నారు.

పంజాబ్‌ సినిమాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సోనం బజ్వా ఈమధ్య కాలంలో హిందీ సినిమాలను ఎక్కువగా చేస్తుంది. సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ హౌస్‌ఫుల్‌ 5 లో నటిస్తోంది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయితే కచ్చితంగా బాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయం. మరో వైపు బాఘి సినిమా ప్రాంచైజీలోనూ ఈమె నటిస్తోంది. బాఘి 4 సినిమాలో ఈమె నటిస్తోంది. ఈ రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ సినిమాలు కావడంతో కచ్చితంగా సోనం బజ్వా బాలీవుడ్‌లో రాబోయే అయిదు సంవత్సరాలు ఫుల్‌ బిజీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. హిందీ సినిమాలతో హిట్‌ కొడితే టాలీవుడ్ లేదా కోలీవుడ్‌లో నటించేందుకు ఈమెకు మంచి ఆఫర్లు దక్కవచ్చు అంటున్నారు. మొత్తానికి ఇలాంటి అందమైన ఫోటో షూట్స్ కారణంగా వైరల్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటుంది.