పంజాబీ బ్యూటీ డబుల్ ధమాకా!
పంజాబీ బ్యూటీ సోనమ్ బజ్వా టాలీవుడ్ కు సుపరిచితమే. `బాబు బంగారం`లో ఐటం పాటతో ప్రేక్షకుల్ని అలరించింది. అటుపై `ఆటాడుకుందారా`, `బోర్న్ టూ బి కింగ్` లాంటి చిత్రాల్లో నటించింది.
By: Tupaki Desk | 11 Dec 2024 9:30 PM GMTపంజాబీ బ్యూటీ సోనమ్ బజ్వా టాలీవుడ్ కు సుపరిచితమే. `బాబు బంగారం`లో ఐటం పాటతో ప్రేక్షకుల్ని అలరించింది. అటుపై `ఆటాడుకుందారా`, `బోర్న్ టూ బి కింగ్` లాంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాలు చేయలేదు. ఎక్కువగా పంజాబీ చిత్రాల్లోనే నటించింది. తమిళ్, హిందీలో కొన్ని సినిమాలు చేసింది. అయితే సొంత భాషలో సక్సెస్ అయినంతగా ఇతర భాషల్లో సక్సెస్ అవ్వలేదు. దీంతో సోనమ్ బజ్వా అంతగా ఫేమస్ కాలేపోయింది.
అయితే అమ్మడికిప్పుడా ఛాన్స్ ముందుంది. బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ హౌస్ పుల్ నటించే అవకాశం దక్కించు కుంది. ` హౌస్ ఫుల్ 5`లో నటించే అవకాశం వచ్చింది. అలాగే మరో హిట్ ప్రాంచైజీ `భాఘీ`లోనూ ఛాన్స్ అందుకుంది. `బాఘీ-4`లో చాన్స్ వచ్చింది. ఈ రెండు చిత్రాల్ని నిర్మించేది సాజిద్ నడియావాలా. ఆయనే సోనమ్ బజ్వాకి తన నిర్మాణ సంస్థలో ఈ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
ఓ రకంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాలు కూడా అమ్మడికి డెబ్యూలు అనే అనాలి. `బాల` అనే హిందీ చిత్రంలో నటించినప్పటికీ అందులో అమ్మడి పాత్ర కూడా చిన్నది. సినిమా పెద్ద హిట్ అయినా సోనమ్ బజ్వాని గుర్తు పట్టడం కష్టమే అన్నట్లుగా ఉంటుంది. అందులో హీరోయిన్ గా భూమీ పడ్నే కర్ నటించింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, యామీ గౌతమ్ మరో హీరోయిన్ గా నటించింది.
వీళ్లందరి మధ్యలో సోనమ్ బజ్వా పాత్ర హైలైట్ కాలేదు. అయితే తాజా అవకాశం ఆస్యమైనా `బాఘీ`, హౌస్ పుల్ లాంటి ప్రాంచైజీలతో కంబ్యాక్ అవ్వడంతో? అమ్మడు బాగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలు సక్సెస్ అయితే మరిన్ని కొత్త అవకాశాలకు ఆస్కారం ఉంది.