Begin typing your search above and press return to search.

48 కోట్ల‌తో ఫేమ‌స్ రిథ‌మ్ స్టూడియోని కొనేశారు

పాపుల‌ర్ ఫ్యాష‌న్ బ్రాండ్స్ క‌ర్త‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ స‌క్సెస్ రేటు గురించి వ్యాపార‌వ‌ర్గాల్లో చాలా చ‌ర్చ ఉంది.

By:  Tupaki Desk   |   24 Oct 2024 6:02 AM GMT
48 కోట్ల‌తో ఫేమ‌స్ రిథ‌మ్ స్టూడియోని కొనేశారు
X

పాపుల‌ర్ ఫ్యాష‌న్ బ్రాండ్స్ క‌ర్త‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ స‌క్సెస్ రేటు గురించి వ్యాపార‌వ‌ర్గాల్లో చాలా చ‌ర్చ ఉంది. ఆమె భ‌ర్త ఆనంద్ అహూజా విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌. లండ‌న్ కేంద్రంగా అత‌డు భారీ వ్యాపారాల‌ను నిర్వ‌హిస్తున్నాడు. ఈ జంట వార్షికాదాయం ఆశ్చ‌ర్య‌ప‌రిచే స్థాయిలో ఉంది. ఇప్పుడు ఈ జంట త‌మ వ్యాపారాల‌కు మ‌రో క‌లికితురాయిని జోడించారు. దీనికోసం ఏకంగా 50కోట్లు వెచ్చించారు.

ముంబైలో ఉన్న ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ రిథమ్ హౌస్‌ను సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా 5.7 మిలియన్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేశారనేది తాజా వార్త‌. భార‌తీయ క‌రెన్సీలో దీని విలువ 48 కోట్లు. సుమారు 3,600 చదరపు అడుగుల దుకాణం 2018 నుండి మూసివేసి ఉంది. దాని మునుపటి యజమాని నీరవ్ మోడీ బిలియన్ల డాలర్ల భారీ బ్యాంకు రుణాలను చెల్లించలేకపోయాడు. రిథమ్ హౌస్ సేల్ వ్య‌వ‌హారాన్ని భారత దివాలా కోర్టు పర్యవేక్షించింది. దాని విలువ నిర్ధారించ‌గా, స్టార్ హీరోయిన్ సోన‌మ్ ఆమె భ‌ర్త అహూజా సంయుక్తంగా దీనిని కొనుగోలు చేసారు.

పాపుల‌ర్ ప్రాప‌ర్టీ బ్రోక‌ర్ వివ‌రాల ప్ర‌కారం...``రిథమ్ హౌస్‌ను 478.4 మిలియన్ రూపాయ‌ల‌(5.7 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల‌)కు విక్రయించడానికి వాటాదారుల కమిటీ ఆమోదించింది. డీల్ కాస్ట్ లీనే అయినా కానీ, ఆనంద్ అహుజా దుస్తుల లేబుల్ అయిన భానే ప్రతినిధి రిథమ్ హౌస్ కొనుగోలును ధృవీకరించారు. అయితే దీనిని ఇంకా సెల‌బ్రిటీ జంట‌ అధికారికంగా వెల్లడించలేదు. ``ఈ కొనుగోలుకు ఆస‌క్తిగా ఉన్నాం. నగరంలో మా రిటైల్ ఉనికిని విస్తరించడానికి ప్లాన్ చేసాము. ప్రైవేట్ కంపెనీలు గ‌నుక‌ మేము బిడ్‌కు సంబంధించి ఎటువంటి ఆర్థిక వివరాలపై వ్యాఖ్యానించలేము``అని భానే ప్రతినిధి ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. రిథమ్ హౌస్ డీల్ ముగియ‌డంతో వినైల్ రికార్డ్‌లు, క్యాసెట్‌లను వినడాన్ని ఇష్టపడే సంగీత ప్రియుల కోసం ఒక శకానికి ముగింపు పలికింది. అక్కడ వారి అభిమాన సంగీత‌ద‌ర్శ‌కుల పాట‌ల‌తో CDలు డివిడిలు ల‌భించేవి. కానీ అవ‌న్నీ క‌నుమ‌రుగ‌య్యాయి.

1940లలో స్థాపించిన ఈ స్టోర్‌లో ఒకప్పుడు పండిట్ రవిశంకర్ - జెత్రో తుల్‌కి చెందిన ఇయాన్ ఆండర్సన్ వంటి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు ఉన్నారు. ఈ స్టోర్ ఒకప్పుడు దిగ్గజ కళాకారులకు ఆతిథ్యం ఇచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ దాని ఔచిత్యాన్ని తగ్గించినందున ఇటీవ‌ల ప‌రిస్థితులు మారాయి. 1990ల చివరి నాటికి మ్యూజిక్ పైరసీ, డిజిటల్ స్ట్రీమింగ్ పెరగడంతో సంగీత ప్రియుల్లో దాని ప్రాముఖ్యత తగ్గింది. రిథ‌మ్ స్టూడియో హౌస్ చాలా కాలంగా మూత‌ప‌డి ఉంది. ఇప్పుడు దాని స్థానంలో సోన‌మ్- అహూజా జంట తమ సొంత లేబుల్ వ‌స్త్ర శ్రేణి వ్యాపారాన్ని ప్రారంభిస్తుంద‌ని భావిస్తున్నారు.