Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ రీ ఎంట్రీ.. కండీషన్స్‌ అప్లై!

ఆమె ఓకే చెప్పాలే కానీ ఇప్పటికి ఏడాదికి రెండు మూడు సినిమాలు అయినా చేసే అవకాశాలు దక్కించుకుంటుంది. కానీ సోనమ్‌ కపూర్ మాత్రం సినిమాల్లో నటించేందుకు ఓకే, కానీ అంటూ కండీషన్స్‌ అప్లై అని వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తుంది.

By:  Tupaki Desk   |   11 Feb 2025 12:30 PM GMT
స్టార్‌ హీరోయిన్‌ రీ ఎంట్రీ.. కండీషన్స్‌ అప్లై!
X

కపూర్ ఫ్యామిలీ అమ్మాయి కావడంతో సోనమ్‌ కపూర్‌కి బాలీవుడ్‌ ఎంట్రీ ఈజీగానే దక్కింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు సంజయ్‌ లీలా భన్సాలీ టీంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసిన సోనమ్‌ కపూర్‌ తక్కువ సమయంలోనే హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. 2007లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన 'సావరియా' సినిమాతో సోనమ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బాలీవుడ్‌ను తనవైపుకు తిప్పుకున్న ముద్దుగుమ్మ సోనమ్‌ కపూర్‌ దాదాపు పదేళ్ల పాటు బిజీ బిజీగా సినిమాలు చేస్తూ బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్ జాబితాలో నిలిచింది. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే వివాహం చేసుకుంది.

ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ, బాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకున్న సోనమ్‌ కపూర్‌ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ ఆహుజాని వివాహం చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సోనమ్‌ కపూర్‌ ఆ తర్వాత కూడా సినిమాల్లో నటించింది. అయితే అమ్మ అయిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సోనమ్‌ కపూర్‌ సినిమాలపై ఎక్కువ ఆసక్తి కనబర్చడం లేదు. ఆమె ఓకే చెప్పాలే కానీ ఇప్పటికి ఏడాదికి రెండు మూడు సినిమాలు అయినా చేసే అవకాశాలు దక్కించుకుంటుంది. కానీ సోనమ్‌ కపూర్ మాత్రం సినిమాల్లో నటించేందుకు ఓకే, కానీ అంటూ కండీషన్స్‌ అప్లై అని వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తుంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సోనమ్‌ కపూర్‌ మాట్లాడుతూ.. పెళ్లితో కొత్త జీవితం మొదలు అయ్యింది. బాబు పుట్టిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోయింది. తన ప్రియార్టీస్ అన్నీ మారాయి. అన్ని విధాలుగా తాను కొత్త జీవితంలో అడుగు పెట్టాను. అయినా తనకు చాలా మంది నుంచి ఆఫర్లు వచ్చాయి. చాలా కథలు విన్నాను. తన ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో సినిమాలు చేయడం తక్కువ అయ్యింది. ప్రతి తల్లికి పిల్లలు మొదటి ప్రాధాన్యత. నాకు కూడా అదే విధంగా పిల్లలు ఫ్యామిలీ మొదటి ప్రాధాన్యత. దాన్ని చూసుకుంటూ సినిమాలు చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక ముందు మంచి కథలతో సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటానని అంది.

ప్రస్తుతం పర్సనల్‌ లైఫ్‌ చాలా సంతోషంగా సాగుతోంది. ఇలాంటి లైఫ్‌ను వదిలేసి టెన్షన్ జీవితంలోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఏంటని సోనమ్‌ కపూర్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు నచ్చిన దర్శకులు, నన్ను నమ్మి సరదాగా సినిమాలు చేసే దర్శకులతో సినిమాలు చేసేందుకు కంఫర్ట్‌గా ఉన్నాను అంది. పెళ్లికి ముందు సైతం తాను సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఇలాంటి పద్దతులను ఫాలో అయ్యేదాన్ని. ఎవరైతే నన్ను నమ్ముతారో వారితో వర్క్ చేస్తాను, వర్క్‌ ప్లేస్‌లో సరదా సమయం గడిపేందుకు తాను ఇష్టపడుతాను. అందుకే తనకు అత్యంత సన్నిహితులు అయిన దర్శకులతో మాత్రమే నటించాలని భావిస్తున్నట్లు ముద్దుగుమ్మ సోనమ్‌ కపూర్‌ చెప్పుకొచ్చింది. 2023లో బ్లైండ్‌ సినిమాతో వచ్చిన సోనమ్‌ కపూర్ ఇప్పటి వరకు కొత్త సినిమాకు కమిట్‌ కాలేదు. ఈ ఏడాదిలో అయినా ఈమె కొత్త సినిమా ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.