కపూర్ ఫ్యాషనిస్టా మైండ్ బ్లాక్ ఫోజ్
ఇక ఫ్యాషన్ రంగంలో మింత్రా వంటి పాపులర్ బ్రాండ్లకు సోనమ్ ప్రచారం చేస్తుంది.
By: Tupaki Desk | 28 July 2024 11:30 AM GMTఅరుదైన ఫ్యాషనిస్టాగా కపూర్ గాళ్ సోనమ్ సుపరిచితురాలు. ముంబై టు ప్యారిస్ సోనమ్ ఫ్యాషన్ ఈవెంట్లు, పర్యటనల గురించి నిరంతరం వింటూనే ఉన్నాం. ప్రత్యక్షంగా లైవ్ టూర్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోనమ్ సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. ఇక ఫ్యాషన్ రంగంలో మింత్రా వంటి పాపులర్ బ్రాండ్లకు సోనమ్ ప్రచారం చేస్తుంది.
తాజాగా `మింట్- ది క్యూరేటర్` మ్యాగజైన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది సోనమ్ కపూర్. ఈ మ్యాగజైన్ కోసం స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొన్న సోనమ్ రకరకాల డిజైనర్ దుస్తుల్లో అభిమానులకు కనిపించింది. సోనమ్ కవర్ ఫోటోషూట్ లో ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే వెస్ట్రన్ స్టైల్స్ ని ఈ ఫోటోషూట్ కోసం అనుకరించింది ఈ బ్యూటీ. బ్లూ అండ్ బ్లాక్ స్పెషల్ డిజైనర్ దుస్తుల్లోను సోనమ్ కొత్తదనాన్ని ఎలివేట్ చేసిన ఫోటోలు ఈ షూట్ లో యూనిక్ లుక్ తో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఫ్యాషనిస్టా ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
ఇక సినిమాలకు కొన్నాళ్లుగా దూరంగా ఉన్న సోనమ్ మరోవైపు తన ఫేవరెట్ కీనూ రీవ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో చర్చించింది. ఇటీవల కీనూ రీవ్స్ మొదటి నవల `ది బుక్ ఆఫ్ ఎల్స్‌వేర్` విడుదలకు ముందు సహ రచయిత చైనా మివిల్లేతో కలిసి బీబీసీ న్యూస్‌తో కీను రీవ్స్ ఇంటర్వ్యూ గురించి సోనమ్ చర్చించారు. ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కీనూ రీవ్స్ క్లిప్‌ను పోస్ట్ చేసింది. ఇందులో అతడు మరణం గురించి మరణాలపై తన అవగాహన గురించి వెల్లడించారు.
సోనమ్ ఫేవరెట్ స్టార్ ఎవరో తెలుసా?
జాన్ విక్, ది మ్యాట్రిక్స్, డెవిల్స్ అడ్వకేట్ వంటి చిత్రాలతో కీనూ రీవ్స్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులేర్పడ్డారు. అతడి నటనకు ప్రశంసలు కురిసాయి. టాయ్ స్టోరీ, సూపర్-పెట్స్ సహా పలు యానిమేషన్ చిత్రాలకు వాయిస్ ఓవర్‌లు అందించిన నటుడిగా విస్తృతంగా ప్రశంసలు పొందారు. ది న్యూయార్క్ టైమ్స్ ద్వారా 21వ శతాబ్దపు ఉత్తమ నటుడుగా గుర్తించింది. టైమ్ మ్యాగజైన్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా కీనూకి గుర్తింపును ఇచ్చింది.
సోనమ్ ఫేవరెట్ స్టార్ కీనూ ఎల్లపుడూ మరణం గురించి, మరణాలపై కేస్ స్టడీ గురించి మాట్లాడతారు. కీనూ చలనచిత్ర పరిశ్రమలో నటుడిగానే కాకుండా, బ్రిటిష్ ఫిక్షన్ రచయిత - సాహిత్య విమర్శకుడు చైనా మివిల్లేతో కలిసి `ది బుక్ ఆఫ్ ఎల్స్‌వేర్` పేరుతో తన మొదటి నవల కోసం పని చేస్తున్నాడు. నవల ఊహాజనిత కాల్పనిక సాహిత్యానికి సంబంధించినది. కథ ఒక ప్రత్యామ్నాయ విశ్వంలో సాగుతుంది. ఒక అమర యోధుని జీవితాన్ని అనుసరించి, జీవితం, మరణం ఇతివృత్తాలను చాలా వివరంగా అన్వేషించే రచన ఇది.
నేను నిత్యం మరణం గురించే ఆలోచిస్తాను:
BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీను తన తదుపరి నవల సందర్భానికి సంబంధించి మరణం- మరణాల గురించి తన ఆలోచనలేమిటో వివరించాడు. నేను అన్ని సమయాలలో మరణం గురించి ఆలోచిస్తాను అని కీనూ చెప్పాడు. మరణం గురించి ఆలోచించడం మంచిదని పేర్కొన్నాడు. చావు గురించి ఆలోచించడానికి కీను ఇంకా చాలా చిన్నవాడని ఇంటర్వ్యూయర్ ఆశ్చర్యపోగా.. ఇది మనకు ఉన్న శ్వాసను, మన సంబంధాలలో పొగడ్తలను సెన్సిటివ్ గా మారుస్తుందని కూడా కీనూ చెప్పాడు. మరణాల భావనపై సానుకూల, ఆశాజనక దృక్పథాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఈ నవల కోసం కల్పిత- కాల్పనిక ప్రపంచాలను ఒకదానితో ఒకటి కలిపి సృజనాత్మకతను ఆవిష్కరిస్తున్నట్టు కీనూ తెలిపాడు. ఈ పుస్తకంలో మరణం గురించి బ్లాస్ట్ అయ్యే ఎన్నో విషయాలను చర్చిస్తున్నారు. మనిషిగా ఉండటం అంటే ఏమిటో కూడా చర్చించే అవకాశం ఉంది.