కపూర్ లేడీ దెబ్బకు అంబానీ పెళ్లి షేక్
సోనమ్ ఘాడంగా హత్తుకునే అందమైన నల్ల రంగు దుస్తుల్లో ఈ వేదిక వద్ద కనిపించింది. దీనిని ఫ్యాషన్ గురువులు డ్రమటిక్ బ్లాక్ గౌన్ అని పిలుస్తున్నారు.
By: Tupaki Desk | 3 March 2024 9:45 AM GMTముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వేడుకలకు సినీరాజకీయ, పారిశ్రామిక రంగాల నుంచి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. వేడుక నుంచి టాప్ సెలబ్రిటీల ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ ని హీటెక్కిస్తున్నాయి. ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి టాప్ 10 యాంజెల్స్ అటెండయ్యారు. వీళ్లలో కియరా అద్వాణీ, జాన్వీ కపూర్, సుహానాఖాన్, నవ్య నవేళి నందా లాంటి నవతరం నటీమణులు ఉన్నారు. కత్రిన, కరీనా, కాజోల్ లాంటి సీనియర్లు ఇక్కడ సందడి చేసారు.
అయితే ఎందరు ఉన్నా కపూర్ లేడీ సోనమ్ కపూర్ ఈ వేదిక వద్ద షో స్టాపర్ గా నిలిచింది. బాలీవుడ్ ఫ్యాషనిస్టాగా ఓ వెలుగు వెలిగిన సోనమ్ ఇటీవల తన భర్త ఆనంద్ అహూజాతో కలిసి లండన్ లో నివశిస్తున్నారు.
కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ముంబైలో మెరుస్తూ తన వ్యాపార కార్యక్రమాలతో బిజీ అవుతున్నారు. సోనమ్ ఇప్పుడు అంబానీల పెళ్లిలో మెరుపులు మెరిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
సోనమ్ ఘాడంగా హత్తుకునే అందమైన నల్ల రంగు దుస్తుల్లో ఈ వేదిక వద్ద కనిపించింది. దీనిని ఫ్యాషన్ గురువులు డ్రమటిక్ బ్లాక్ గౌన్ అని పిలుస్తున్నారు. ఈ గౌన్ ని డిజైన్ చేసిన తీరు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. తన సోదరి రియాతో కలిసి పార్టీకి ముందు పార్టీకి తర్వాత ఆనందిస్తున్నట్టు సోనమ్ తాజా ఇన్ స్టా పోస్ట్ లో వెల్లడించింది. అనోఖిఐకి సరిపోలేలో ఈ దుస్తులను రియా స్టైలింగ్ చేసిందని తెలిపింది. దినేష్ అహూజా ఈ ఫోటోషూట్ చేసారు. కపూర్ లేడీ దెబ్బకు అంబానీ పెళ్లి షేక్ అయిందంటూ అభిమానులు ఇన్ స్టాలో వ్యాఖ్యానిస్తున్నారు.