Begin typing your search above and press return to search.

క‌పూర్ ఫ్యాష‌నిస్టా ఆధునిక వ‌ధువు రూపం

ముఖ్యంగా ముత్యాల‌తో త‌యారు చేసిన‌ అద్భుతమైన హెడ్‌పీస్ ని సోన‌మ్ ధ‌రించింది. అలాగే హాఫ్ షోల్డ‌ర్ వైట్ డ్రెస్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచిపోయింది

By:  Tupaki Desk   |   23 July 2024 7:36 PM GMT
క‌పూర్ ఫ్యాష‌నిస్టా ఆధునిక వ‌ధువు రూపం
X

సోనమ్ కపూర్ హిందీ చిత్ర పరిశ్రమలో ఫ్యాషన్ ఐకాన్‌గా గొప్ప‌ గుర్తింపు పొందింది. హిందీ చిత్ర‌సీమ‌లో అద్భుత‌ నటప్రతిభతో స్టార్ గా ఎదిగిన సోన‌మ్ త‌న‌దైన ఫ్యాష‌న్ సెన్స్ తోను నిరంత‌రం ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది. ఆనంద్ అహూజాను వివాహం చేసుకున్న సోన‌మ్ కి `వాయు` అనే అందమైన పాప ఉంది. మామ్ అయిన త‌ర్వాత కూడా ఒక ఫ్యాషనిష్టాగా దూసుకెళుతున్న‌ సోన‌మ్ ఇప్పుడు `పెళ్లి చూపులు` కాన్సెప్టు ఫోటోషూట్ ని షేర్ చేసింది. ముఖ్యంగా ముత్యాల‌తో త‌యారు చేసిన‌ అద్భుతమైన హెడ్‌పీస్ ని సోన‌మ్ ధ‌రించింది. అలాగే హాఫ్ షోల్డ‌ర్ వైట్ డ్రెస్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచిపోయింది.

తాజా ఫోటోషూట్ లో సోనమ్ తన విలక్షణమైన హెడ్‌పీస్‌ను తిరిగి పరిచయం చేసింది. ఈసారి వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ హెడ్ పీస్ లో సోన‌మ్ మెరిసిపోతోంది. త‌న‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బోల్డ్ ఫోటోషూట్‌ను షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. ఫుల్ స్లీవ్ బ్లౌజ్, తెల్లటి చీరలో మెరిపించిన సోన‌మ్ బంగారు అంచులతో అలంకరించిన పొడవైన వీల్‌తో అందంగా క‌నిపించింది. ఇది ఆధునిక వధువు రూపం.

ఈ ప్ర‌త్యేక‌మైన డిజైన‌ర్ లుక్ లో బంగారం, ముత్యాలతో చేసిన పాతకాలపు మఠం పట్టీ రాయల్టీని గుర్తుకు తెస్తుంది. ఈ హెడ్‌పీస్ సోన‌మ్ వివాహ ఆభరణాలలో భాగం. రెడ్డిట్‌లో ఈ ఫోటో కనిపించినప్పుడు గొప్ప‌ ప్రశంసలను పొందింది. అభిమానులు క్వీన్ అని కొనియాడారు. ధైర్యంగా ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లతో దూసుకెళ్లే సోన‌మ్ సామర్థ్యాన్ని ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.

సోన‌మ్ రెగ్యుల‌ర్‌గా అనామికా ఖన్నా, ఎలీ సాబ్ అండ్ రాల్ఫ్ & రస్సో వంటి ప్రఖ్యాత డిజైనర్‌ల నుండి దుస్తుల‌ను ఎంపిక చేస్తుంది. ఇవి అద్భుత‌మైన‌ ఎంపికలు ఫ్యాషన్‌పై లోతైన అవగాహనను ప్రతిబింబిస్తాయి. సోన‌మ్ సహజసిద్ధమైన అంద‌చందాలు.. ఆత్మవిశ్వాసం త‌న‌ను పరిశ్రమలో ట్రెండ్‌సెట్టర్‌గా ఆవిష్క‌రించాయి.