పూల్ సైడ్ స్వర్గం చూపిస్తున్న నటి
తెలుగులో వరుసగా యువహీరోల సరసన అవకాశాలు అందుకుంది ఉత్తరాది బ్యూటీ సోనారిక బదోరియా.
By: Tupaki Desk | 23 Feb 2025 10:30 PM GMTతెలుగులో వరుసగా యువహీరోల సరసన అవకాశాలు అందుకుంది ఉత్తరాది బ్యూటీ సోనారిక బదోరియా. జాదుగాడు చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈ బ్యూటీ, ఆ తర్వాత నాగశౌర్య సరసన నటించింది. బెల్లంకొండ `స్పీడున్నోడు`లోనూ సోనారికా నటించింది. `ఈడోరకం ఆడోరకం`లో మంచు హీరోతో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లింది. ఇంద్రజిత్ అనే తమిళ చిత్రంలోనూ నాయికగా నటించింది.
నిజానికి ఈ బ్యూటీ ఆరంభం టీవీ సీరియళ్లతో పాపులరైంది. హిందీలో హరహర మహదేవ్ సీరియల్ తో సోనారిక నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ఓటీటీలో అవకాశాలొస్తున్నాయని కథనాలొచ్చాయి. మరోవైపు సోనారిక సోషల్ మీడియాల్లోను స్పెషల్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ఈ బ్యూటీ బికినీ ట్రీట్ యువతరంలో చర్చగా మారింది. అద్భుతమైన ఆనందాలతో పూల్ సైడ్ ప్యారడైజ్ అంటూ అందమైన బ్లూ స్విమ్ సూట్ ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసింది.
పూల్ లో ఈతకు వెళుతున్న ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.. సోనారిక స్లైస్-ఆఫ్-లైఫ్ OTT సిరీస్ `నో కిడ్డింగ్`లో నటించిన సోనారిక కరణ్ (రజ్దాన్) సర్ చిత్రం `హిందుత్వ`లో నటించింది. లక్నో బ్యూటీ సోనారికకు బిజనెస్ మేన్ వికాష్ పరషార్ తో ఇంతకుముందు నిశ్చితార్థమైంది. ఈ జంట ఫోటోలు కూడా అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తొమ్మిదేళ్ల ప్రేమాయణం తర్వాత సోనారిక తన చిరకాల ప్రియుడు వికాస్ పరాశర్‌ను 2024 ఫిబ్రవరి 18న వివాహం చేసుకుంది. రణతంబోర్‌లోని నహర్‌గఢ్ ప్యాలెస్‌లో హిందూ సాంప్రదాయంలో ఈ జంట వివాహం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.