Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆరెంజ్ బికినీలో మ‌తులు చెడ‌గొడుతోంది

తాజాగా బికినీ బీచ్ యాత్రలో ఉన్న‌ సోనారిక‌ అంద‌మైన ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   25 Dec 2024 1:30 AM GMT
ఫోటో స్టోరి: ఆరెంజ్ బికినీలో మ‌తులు చెడ‌గొడుతోంది
X

తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల్లో న‌టించింది ఉత్త‌రాది బ్యూటీ సోనారిక బ‌దోరియా. తెలుగులో జాదుగాడు, స్పీడున్నోడు లాంటి చిత్రాల్లో న‌ట‌న‌కు పేరు తెచ్చుకుంది. `ఈడోరకం ఆడోరకం`తో మంచు కాంపౌండ్ కి ప‌రిచ‌య‌మైంది. అలాగే బాలీవుడ్ లో ప‌లుచిత్రాల్లో న‌టించింది. ఇంద్రజిత్ అనే త‌మిళ చిత్రంలోనూ నాయిక‌గా న‌టించింది. కానీ సౌత్ లో ఆశించిన మైలేజ్ రాలేదు. కొంత‌కాలం టీవీ సీరియ‌ళ్ల‌తోను బిజీ అయింది. హిందీలో హరహర మహదేవ్ సీరియల్ తో సోనారిక న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్ లో వెండితెర‌పైనా న‌టిస్తోంది.

న‌టిగా కెరీర్ మాట అటుంచితే ఇంత‌కుముందే ఈ బ్యూటీ త‌న ప్రియుడు వికాష్ ప‌రాషార్ తో నిశ్చితార్థం చేసుకుంది. ఎనిమిదేళ్ల పాటు డేటింగ్ త‌ర్వాత ఈ జంట‌కు నిశ్చితార్థం అయింది. మ‌రోవైపు సోనారిక సోష‌ల్ మీడియాల్లోను స్పెష‌ల్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. తాజాగా బికినీ బీచ్ యాత్రలో ఉన్న‌ సోనారిక‌ అంద‌మైన ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. వీటిలో ఆరెంజ్ బికినీలో వీడియో షూట్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది. త‌న భ‌ర్త‌తో క‌లిసి అంద‌మైన వెకేష‌న్ ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

అయితే ఈ ఫోటోగ్రాఫ్ తో పాటు క్యాప్ష‌న్ కూడా ఆక‌ట్టుకుంటోంది. వికాస్‌కి సోనారికతో పెళ్లయిన ఫీలింగ్ ఉంటే? అని ప్ర‌శ్నించ‌గా... `` నాకు పెళ్ళైనట్లు అనిపిస్తుంది`` అని అన్నాడు. పెళ్లి జీవితాన్ని ఫీల‌వుతున్నావా? అని ప్ర‌శ్నించ‌గా, `కొంచెం` అని అన్నాడు అత‌డు. మొత్తానికి పెళ్లితో ప‌ని లేకుండా లివిన్ రిలేష‌న్ ష‌ప్ లో ల‌వ్ లైఫ్ ని కొన‌సాగించేయ‌డం ఆనందంగా ఉంద‌ని ఈ జంట ధృవీక‌రిస్తోంది. సోనారిక స్లైస్-ఆఫ్-లైఫ్ OTT సిరీస్ `నో కిడ్డింగ్`లో న‌టించిన సోనారిక ... కరణ్ (రజ్దాన్) సర్ చిత్రం హిందుత్వ లోను న‌టించింది.