Begin typing your search above and press return to search.

సీరియల్ నటి హై గ్లామర్ షో.. నెవ్వర్ బిఫోర్ లుక్!

బీచ్ లో వైట్ కలర్ షర్ట్, షార్ట్ వేసుకొని ఫోటోలకి ఫోజులిచ్చింది. ఓ వైపు సముద్రం, మేఘాల అందం సోనారిక బ్యూటీకి నిగారింపు తీసుకొస్తోంది.

By:  Tupaki Desk   |   17 March 2024 4:35 AM GMT
సీరియల్ నటి హై గ్లామర్ షో.. నెవ్వర్ బిఫోర్ లుక్!
X

దేవ్ కా దేవ్ మహాదేవ్ సీరియల్ లో పార్వతీదేవి పాత్రలో నటించి అందరికి చేరువ అయిన నటి సోకారిక బడోరియా. ఈ అమ్మడుకి ఆ సీరియల్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. తరువాత పృథ్వీ వల్లబ్ సీరియల్ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో నాగ శౌర్యకి జోడీగా జాదూగాడు సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది.

ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా స్పీడున్నోడు సినిమాలో నటించింది. ఈ మూవీ ఆశించిన సక్సెస్ ని ఇవ్వలేదు. నెక్స్ట్ ఈడోరకం ఆడోరకం సినిమాలో మంచు విష్ణుతో జత కట్టింది. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. హిందీలో తెరంగేట్రం సాన్ సైన్ అనే మూవీ చేసింది . తమిళంలో ఇంద్రజిత్ అనే మూవీలో నటించింది. వీటిలో ఏదీ కూడా సోనారికకి కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేదు.

తరువాత అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. చివరిగా హిందుత్వ అనే సినిమాలో సోనారిక నటించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ తన ప్రియుడు, బిజినెస్ మెన్ వికాస్ పరాశర్ ని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఇన్ స్టాగ్రామ్ లో తన పెళ్లి ఫోటోలని షేర్ చేసుకుంది. ప్రస్తుతం వికాస్ తో సోనారికా హనీమూన్ ని ఆశ్వాదిస్తోంది.

అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఈ అమ్మడు రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ కి షేర్ చేసుకుంటూ ఉంటుంది. గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయదు. పెళ్లి తర్వాత కూడా తనలో మోడ్రన్ అండ్ గ్లామర్ టచ్ ని చూపిస్తూ హాట్ ఫోటోని షేర్ చేసింది. బీచ్ లో వైట్ కలర్ షర్ట్, షార్ట్ వేసుకొని ఫోటోలకి ఫోజులిచ్చింది. ఓ వైపు సముద్రం, మేఘాల అందం సోనారిక బ్యూటీకి నిగారింపు తీసుకొస్తోంది.

దీంతో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు యాక్టర్ గా కొనసాగడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై ఈ బ్యూటీని ఎప్పుడు చూస్తామనేది తెలియాల్సి ఉంది. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రస్తుతం సోనారిక ఆశ్వాదిస్తోంది. ఇక గ్లామరస్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమే అన్నట్లు అప్పుడప్పుడు ఇలా స్పెషల్ పోటోలను షేర్ చేసుకుంటోంది. మరో రాబోయే రోజుల్లో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.