కుర్చీ మడత పెట్టి సాంగ్.. ఆయన ఛాయిసా?
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది.
By: Tupaki Desk | 10 Jan 2024 6:12 AM GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా నిన్ననే ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించిన మేకర్స్.. ఇప్పటి వరకు నాలుగు పాటలను రిలీజ్ చేశారు. అయితే కుర్చీ మడతపెట్టి సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియా అంతటా ఈ సాంగ్ పై ఓ రేంజ్ లో డిస్కషన్ జరుగుతోంది.
గతంలో సోషల్ మీడియాలో ఒక వృద్ధుడు ఉపయోగించిన కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ తో రకరకాల చిన్నచిన్న పాటలు వచ్చాయి. ఇప్పుడు అదే డైలాగ్ ను మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా సాంగ్ లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అసలు మహేశ్ క్రేజ్ ఏంటి? ఆయన సినిమాలో ఇలాంటి సాంగ్ పెట్టడం ఏంటి? అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై, త్రివిక్రమ్ పై ఫ్యాన్స్, నెటిజన్స్ ఓ రేంజ్ లో మహేశ్ కల్ట్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు.
అయితే ఈ పాటలో కుర్చీ మడత పెట్టి డైలాగ్ యూజ్ చేసినందుకు ఆ వృద్ధుడికి తమన్ డబ్బులు కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఈ పాట ఐడియా తమన్ దే అని చాలా మంది అనుకున్నారు. ఈ సాంగ్ పై వచ్చిన ట్రోల్స్ తోపాటు మేకింగ్ కోసం తమన్ మాట్లాడతారని అంతా భావించారు. కానీ షాకింగ్ గా తమన్ సైలంట్ అయిపోయారు.
హీరో మహేశ్ బాబు మాత్రం ఈ సాంగ్ కోసం మాట్లాడారు. కుర్చీ మడత పెట్టి సాంగ్ ఐడియా.. తమన్ ది కాదని క్లారిటీ ఇచ్చారు. తనది, త్రివికమ్ దేనని తెలిపారు. “ఈ సాంగ్ కోసం మేం చెప్పాక.. వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా సార్లు ఆలోచిస్తారు. కానీ తమన్ మాత్రం ఒక్క మాట అనకుండా కంపోజ్ చేశారు” అని మహేశ్ తెలిపారు.
ఇప్పుడు మహేశ్ క్లారిటీ అవ్వడంతో తమన్ పై ట్రోల్స్ చేసిన నెటిజన్లు సైలెంట్ అయిపోయారు. చిత్రయూనిట్ మాత్రం ఈ పాటకు మహేశ్, శ్రీలీల వేసిన స్టెప్పులపై ప్రశంసలు కురిపించారు. మహేశ్ డ్యాన్స్ చూడాలనుకునేవారికి ఈ పాట ఓ విజువల్ ఫీస్ట్ అని చెప్పారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక.. ఆ సాంగ్ వస్తున్నప్పుడు థియేటరల్లో ఈలలేనన్నమాట.