Begin typing your search above and press return to search.

బిచ్చ‌గాడిలా ఓ స్టార్ సింగ‌ర్ స‌ర్ ప్రైజ్ ఇది!

అన‌తి కాలంలోనే పాన్ ఇండియాలో అత‌డి పేరు ఓ సంచ‌ల‌నంగా మారింది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 11:30 AM GMT
బిచ్చ‌గాడిలా ఓ స్టార్ సింగ‌ర్ స‌ర్ ప్రైజ్ ఇది!
X

ఏదైనా క్రియేటివ్ గా ఉంటేనే జ‌నాల‌కు న‌చ్చేది...జ‌నాల్లోకి వెళ్లేది. లేదంటే? ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవి వృద్ధాగానే మిగిలిపోతాయి. నెటి జ‌న‌రేష‌న్ యువ‌త ఇప్పుడంతా క్రియేటివ్ గా నే వెళ్తున్నారు. అందుకే ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అవుతున్నారు. తాజాగా టాప్ సింగ‌ర్ సోను నిగ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అన‌తి కాలంలోనే పాన్ ఇండియాలో అత‌డి పేరు ఓ సంచ‌ల‌నంగా మారింది. త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

త‌న గాత్రంతో కోట్లాది మంది శ్రోత‌ల హృద‌యాల్లో గొప్ప స్థానం సంపాదించారు. ల‌క్ష‌ల్లో పారితోషికం అందుకునే స్టార్ సింగ‌ర్ గా అత‌నికి మంచి గుర్తింపు ఉంది. అత‌డి మ్యూజిక్ క‌న్స‌ర్ట్ అంటే మార్కెట్ లో ఓ బ్రాండ్. జ‌నాలు ఎగ‌బ‌డి మ‌రీ వెళ్తారు. గొప్ప ప్ర‌తిభావంతుడు కాబ‌ట్టే ఆ స్థాయికి చేరుకున్నాడు. అయితే ఇత‌డు వినూత్నంగా ఉండే వ్య‌క్తి? అని తెలుస్తోంది. ఐదు గంటలపాటు రోడ్డు పక్కన నిలబడి ఓ బిచ్చగాడి అవతారంలో పాటలు పాడిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

2016లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ సంగ‌తి ఎవ‌రికీ తెలియ‌దు. అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా పెద్ద‌గా లేదు కాబ‌ట్టి జ‌నాల‌కు చేర‌లేదు. వైర‌ల్ గానూ మార‌లేదు. కానీ ఇప్పుడా వీడియో మ‌రోసారి నెట్టింట వైర‌ల్ అవ్వ‌డంతో? అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇందులో సోనూ నిగ‌మ్ త‌న లుక్ ని మార్చేసి ఓ బిచ్చ‌గాడిలా తిరుగుతూ పియానో వాయిస్తూ పాట‌లు పాడుతున్నాడు. అత‌డి గాత్రానికి అంతా ఆక‌ర్షితుల‌వుతున్నారు. నెరిసిన జుట్టు..క‌ళ్ల‌కు న‌ల్ల‌టి అద్దాలు ధ‌రించాడు.

అనామ‌కుడిలా రోడ్డు మీద కూర్చుని వాయిస్తున్నాడు. కానీ అత‌డిని ఎవ‌రూ గుర్తించ‌లేదు. ఈ విష‌యాని నిగమ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అత‌డిని ప‌ట్టి ప‌ట్టి చూస్తే? అత‌నే లా ఉంద‌ని క‌న్ప‌మ్ చేసుకుంటున్నారు. అయితే అలా పాట‌లు పాడిన సంద‌ర్భంలో డ‌బ్బులిచ్చిన ఓ వ్య‌క్తిని క‌లుసుకుని స‌ర్ ప్రైజ్ చేసాడు సోన్ నిగ‌మ్. అప్పుడ‌ప్పుడు ఇలా ఉండ‌టం వ‌ల్ల జీవితం యోక్క ప‌ర‌మార్ధం తెలుస్తుంది.