Begin typing your search above and press return to search.

పద్మ అవార్డులు.. లెజెండరీ సింగర్స్ కనిపించడం లేదా?

ఇదిలా ఉంటే హిందీలో లెజెండరీ గాయకులుగా ఉన్న వారికి ఈ పద్మ పురస్కారాలు ఇవ్వకపోవడంపై స్టార్ గాయకుడు సోనూ నిగమ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిరాశ వ్యక్తం చేశాడు.

By:  Tupaki Desk   |   28 Jan 2025 7:21 AM GMT
పద్మ అవార్డులు.. లెజెండరీ సింగర్స్ కనిపించడం లేదా?
X

కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మ, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులని ప్రకటించింది. వివిధ రంగాలలో ప్రతిభ చూపించేవారికి ఈ అవార్డులని ఎనౌన్స్ చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదు మందిని ఈ పురస్కారాలు వరించాయి. బాలకృష్ణకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే హిందీలో లెజెండరీ గాయకులుగా ఉన్న వారికి ఈ పద్మ పురస్కారాలు ఇవ్వకపోవడంపై స్టార్ గాయకుడు సోనూ నిగమ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిరాశ వ్యక్తం చేశాడు.

ఇండియాలో ఎంతో మంది గాయకులకి స్ఫూర్తిగా నిలిచిన లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ కి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పురస్కారం ఇవ్వలేదు. కనీసం ఆయన స్థాయికి కూడా గౌరవం ఇవ్వలేదని సోనూ నిగమ్ అన్నారు. అలాగే , అల్కా యాగ్నిక్, శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్ వంటి దిగ్గజాలు సంగీత రంగంలో విశేషమైన గుర్తింపు కలిగి ఉన్నారు.

వారి సేవలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినవి. అలాంటి వారిని పద్మ అవార్డుల విషయంలో అస్సలు పట్టించుకోలేదని సోనూ నిగమ్ ఇన్ స్టాగ్రామ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం లెజెండరీ గాయకులని విస్మరించిందని తన అసంతృప్తని సోనూ తెలియజేసారు. గతంలో మహ్మద్ రఫీకి మాత్రమే పద్మశ్రీ పురస్కారం లభించింది.

అయితే కిశోర్ కుమార్ కి ఇప్పటి వరకు ఎలాంటి అవార్డుని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే 2022లో సోనూ నిగమ్ పద్మశ్రీ అందుకున్నారు. అయితే లెజెండరీ గాయకులని ఈ పురష్కారాలకి ఎంపిక చేయకపోవడంపై సోనూ నిగమ్ తన ఆవేదనని ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. వారి ఈ అవార్డులకి పూర్తిస్థాయిలో అర్హత ఉన్నవారిని తెలిపారు.

ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పురష్కారాల విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా సోనూ నిగమ్ చేసిన కామెంట్స్ పైన భిన్నభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సోనూ నిగమ్ కామెంట్స్ ని చాలా మంది సమర్థిస్తున్నారు. లెజెండరీ గాయకులని గౌరవించుకోవాల్సి అవసరం ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు వేచి చూడాలి. తెలంగాణలో కూడా ఎవ్వరికి ఈ సారి పురస్కారాలు రాలేదు. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విమర్శలు చేశారు. అలాగే బాలీవుడ్ లో కూడా ఈ పురష్కారాలపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.