సూపర్‌స్టార్ కూల్ డ్రింక్‌లో సీక్రెట్‌గా మందు కలిపేవాడు!
జీవితంలో ఎప్పుడూ తాను ఆల్కహాల్ తాగలేదని సోనూసూద్ అన్నాడు.
By: Tupaki Desk | 6 Jan 2025 6:30 PM GMTటాలీవుడ్‌లో విలన్‌గా, సహాయనటుడిగా సోను సూద్ పాపులర్. కరోనా క్రైసిస్ కష్టకాలంలో ప్రజలను ఆదుకునే దేవుడు అయ్యాడు. అతడి సాయం తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు అందింది. నటుడిగా అతడి ప్రతిభ, ప్రజా సేవల గురించి అటుంచితే, అతడు గొప్ప ఫిట్ నెస్ ఫ్రీక్. నేటితరానికి ఒక స్ఫూర్తినిచ్చే ప్రభావశీలి.
జీవితంలో ఎప్పుడూ తాను ఆల్కహాల్ తాగలేదని సోనూసూద్ అన్నాడు. ఈ నాలుగేళ్లుగా కనీసం రోటీ కూడా తినలేదని, మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు తింటానని అన్నాడు. తాను వెజిటేరియన్ ని అని తన ఇంట్లో అద్భుతమైన కుక్ లు ఉన్నా కానీ, చీట్ మీల్ ఏనాడూ తినలేదని తెలిపాడు. మాంసాహారం అస్సలు ముట్టనని వెల్లడించాడు.
అంతేకాదు.. ఓసారి సల్మాన్ ఖాన్‌తో షూటింగ్ లో ఉన్నప్పుడు తన వద్ద నుంచి రెడ్ బుల్ తీసుకుని, దానిలో ఆల్కహాల్ కలిపేవాడని, దానిని తిరిగి తనకు ఇచ్చేవాడని సోనూ చెప్పాడు. అయితే తెలివిగా సల్మాన్ ని బురిడీ కొట్టించి తిరిగి అతడికే ఆ రెడ్ బుల్ ను గ్లాసులో వొంపి ఇచ్చేవాడినని కూడా వెల్లడించాడు. అలా అప్పటికి ఆల్కహాల్ తీసుకునే ముప్పు నుంచి తప్పించుకోగలిగానని సోనూ సూద్ వెల్లడించాడు. ఎవరైనా పార్టీకి పిలిస్తే కచ్ఛితంగా మత్తుకు బానిసవుతామని, ఆల్కహాల్ ని తప్పించుకోలేరు అని సోనూసూద్ అన్నాడు. కానీ తాను ఆల్కహాల్ కి ఎప్పుడూ దూరంగా ఉంటానని తెలిపాడు. సల్మాన్ తన వద్ద నుంచి రెడ్ బుల్ తీసుకుని తాగాడని కూడా వెల్లడించాడు.
సోనూ సూద్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం `ఫతే` రిలీజ్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో సోనూ రోజువారీ ఆహారం గురించి మాట్లాడుతూ- ``నేను శాఖాహారిని. నా ఆహారం చాలా బోరింగ్‌గా ఉంటుంది. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఇంట్లో హాస్పిటల్ ఫుడ్ తింటానని అంటారు.. ఇది నా ప్లేట్ అని నేను వారికి చెబుతాను. మీరు మీకు కావలసినది తినండి అంటాను. నేను కాకుండా అందరూ మాంసాహారం తింటారు. మా వద్ద ఉత్తమ వంటవారు ఉన్నారు`` అని అన్నారు. తాను స్కూల్లో, కాలేజీలో ఆహారం విషయంలో గొడవ చేయలేదని తెలిపాడు. ఈ మధ్య చపాతీలు తినడం మానేశాను. మధ్యాహ్నం చిన్న గిన్నెలో పప్పు, అన్నం తింటాను. అల్పాహారం కోసం గుడ్డు వైట్ ఆమ్లెట్, సలాడ్, అవకాడో, సాటెడ్ వెజిటేబుల్స్ లేదా బొప్పాయి తింటాను.. అని డైట్ ప్లాన్ చెప్పాడు.