చావు గురించి ఆలోచించడం మంచిదేనా?
కానీ హాలీవుడ్ డైరెక్టర్ కెను రీన్స్ మరణం గురించి ముందే ఆలోచించడం మంచిదంటున్నాడు.
By: Tupaki Desk | 26 July 2024 3:30 PM GMTమరణం గురించి ముందే ఎవరైనా ఆలోచిస్తారా? అంటే ఆ పదమే నోట రాకూడదని పెద్దలంటారు. వచ్చే మరణం రాక మానదు...దాని గురించి ఇప్పటి నుంచే ఆలోచించాలా? అది తప్పుడు ఆలోచనా? అన్నది పెద్దల వాదన. జీవితం...అందులో ఎదగడం..సాధకబాధకాలు..వాటిని అధిగమించడం వీటిని ఆలోచించు! చావు గురించి అప్పుడే నీకెందుకు అని గట్టిగా క్లాస్ పీకుతారు. కానీ హాలీవుడ్ డైరెక్టర్ కెను రీన్స్ మరణం గురించి ముందే ఆలోచించడం మంచిదంటున్నాడు.
దానికి బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కూడా వత్తాసు పలికింది. దీనికి సంబంధించి కెను రివ్స్ `ది బుక్ ఆఫ్ ఎల్స్వేర్` అనే ఓ నవల రాసాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో మరణంగా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. నేను చావు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటా. దానివల్ల ఊపిరి తీసుకున్నంత కాలం బంధాలకు విలువ ఇవ్వాలని, ఉన్నకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే పాజిటివ్ ఆలోచనలు వస్తాయన్నాడు.
అంటే బతికి ఉన్నంత కాలం మరణం గురించి ఆలోచిస్తే చేసే మంచి చెడు మధ్యవ్యత్యాసం తెలుస్తుంది. జీవితంలో ఉన్నంత కాలం ఇంకాస్త బెటర్ గా బ్రతకవచ్చు అన్న ఆలోచన బలంగా ఉంటుంది అన్నారు. దీనికి సంబంధించిన ఓ క్లిప్పింగ్ ని సోనమ్ కపూర్ ఇన్ స్టా లో షేర్చేసి తన మద్దతు తెలిపింది. అతడి ఎనాలసిస్ చాలా వరకూ కరెక్ట్ గా పలువురు నెటి జనులు భావిస్తున్నారు.
గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా దీనికి సంబంధించి ఓ కామెంట్ చేసాడు. మనుషులంతాపుట్టామని గుర్తు పెట్టుకుంటారు. కానీ మరణం గురించి మర్చిపోతారన్నాడు. ఏదోఒక రోజు చనిపోతాం అన్న సంగతి మర్చిపోయి బ్రతుకు వెళ్లదీస్తున్నారని, మరణాన్ని సైతం గుర్తు పెట్టుకోవాలని, ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలని వ్యాఖ్యానించారు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు ఆమాత్రం దానికి వాళ్ల మీద వీళ్లు...వీళ్ల మీద వాళ్లు అంటూ రకరకాల ఆరోపణలతో అబద్దాల జీవితం గడుపుతున్నామన్నారు.