Begin typing your search above and press return to search.

సలార్ నుంచి ఫస్ట్ సింగిల్.. సూర్యుడే గొడుగు పట్టి..

తాజాగా మూవీ నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేశారు. సూర్యుడే గొడుగు పట్టి.. అంటూ సాగే ఈ పాటలో హీరో ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని చూపించబోతున్నారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:10 PM GMT
సలార్ నుంచి ఫస్ట్ సింగిల్.. సూర్యుడే గొడుగు పట్టి..
X

కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ స‌లార్‌. ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఫుల్ యాక్షన్ రోల్ లో చేస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగ‌తి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ ఈ నెల 22న రిలీజ్ కాబోతుంది.

కాగా, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా మూవీ నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేశారు. సూర్యుడే గొడుగు పట్టి.. అంటూ సాగే ఈ పాటలో హీరో ప్రభాస్, పృథ్వీ రాజ్ సుకుమారన్ మధ్య స్నేహాన్ని చూపించబోతున్నారు.

రవి బస్రూర్ ఈ పాటకు బాణీలు అందించారు. కృష్ణ కాంత్ ఈ సాంగ్ కు లిరిక్స్ అందించగా హరిణి ఇవతూరి ఈ పాటను పాడారు. ఎమోషనల్ గా ఉన్న ఈ సాంగ్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. త్వరలోనే ఈ మూవీ నుంచి మరో ట్రైలర్ ను, సాంగ్ ను కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధం చేస్తున్నారట.

సూపర్ హిట్ చిత్రాలు కేజీఎఫ్, కాంతార తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ తీస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫిమేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్వీరాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సలార్‌ను కేరళలో పృథ్వీరాజ్‌ సుకుమారన్ హోం బ్యానర్ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌ హౌజ్‌ విడుదల చేస్తోంది. నైజాంలో టాలీవుడ్‌ పాపులర్ ప్రొడక్షన్‌ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్ సలార్‌ను రిలీజ్ చేస్తుండగా.. నార్త్ ఇండియాలో అనిల్‌ తడని AA Films ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఇక ఓవర్సీస్‌లో సలార్‌ను Phars Film Co LLC విడుదల చేస్తోంది.