Begin typing your search above and press return to search.

ప‌చ్చ కోక‌లో జిల్ల‌నిపించిన సోఫీ

న‌ల‌భై పైగా ఏజ్ తో ఉన్న ఈ బ్యూటీకి అవ‌కాశాలు జీరో అయిపోయాయి.

By:  Tupaki Desk   |   1 Nov 2024 2:30 AM GMT
ప‌చ్చ కోక‌లో జిల్ల‌నిపించిన సోఫీ
X

`లండ‌న్ బాబులు లండ‌న్ బాబులు` అంటూ ఐట‌మ్ పాట‌తో మెప్పించింది సోఫీ చౌద‌రి. `1-నెనొక్క‌డినే`లో స్పెష‌ల్ నంబ‌ర్ లో త‌న‌దైన వయ్యారంతో మురిపించిన‌ బాలీవుడ్ న‌టి సోపీ చౌద‌రి ఆ త‌ర్వాత తెలుగు ప‌రిశ్ర‌మ‌లో క‌నిపించ‌లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో కూడా త‌న కెరీర్ అంతంత మాత్ర‌మే. టీవీ షోలు యోగా సెష‌న్‌లు అంటూ సోఫీ సోష‌ల్ మీడియాల్లో కొంత హ‌డావుడి చేస్తుంది కానీ, ఆ ర‌కంగానూ అంత‌గా ఫేమ్ లేదు. న‌ల‌భై పైగా ఏజ్ తో ఉన్న ఈ బ్యూటీకి అవ‌కాశాలు జీరో అయిపోయాయి.


అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు టెంప్టింగ్ ఫోటోషూట్ల‌తో హీటెక్కిస్తుంది. తాజాగా సోఫీ ప‌చ్చ రంగు డిజైన‌ర్ చీర‌, ర‌వికెలో మ‌తులు చెడ‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. సోఫీ అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయంటూ యూత్ కామెంట్ చేస్తున్నారు. సోఫీ స్ట‌న్నింగ్ దీవాళీ లుక్ కి ఫిదా అయిపోయామంటూ కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.


ఇక సోఫీ బాలీవుడ్ ఎంట్రీ విష‌యానికి వ‌స్తే 15 ఏళ్ల క్రిత‌మే `షాది నెంబ‌ర్ 1` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత `ప్యార్ కి సైడ్ ఎఫెక్స్ట్`.. `ఐ సీయూ`స‌హా చాలా చిత్రాల్లో న‌టించింది. ఎక్కువ‌గా ఆమె ఫోక‌స్ అయింది ఐటం గాళ్ల్ గానే. కానీ ఆ ర‌కంగా ఆమె కెరీర్ సాపిగా సాగ‌లేదు. అవ‌కాశాలు రావ‌డం..మ‌ధ్య‌లో బ్రేకులు ఇలా మొత్తం కెరీర్ న‌త్త‌న‌డ‌క‌నే సాగింది. ద‌శాబ్ధ కాలంగా స‌రైన అవ‌కాశాల్లేక ఇబ్బంది ప‌డుతోంది.