'మంజుమ్మల్ బోయ్స్' కి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో!
సొంత భాష మాలీవుడ్ ని సైతం పక్కన బెట్టి టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ సక్సెస్ ల మీద సక్సెస్ లు అందుకుంటున్నాడు.
By: Tupaki Desk | 19 Jan 2025 7:30 AM GMTదుల్కర్ సల్మాన్ సౌత్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సొంత భాష మాలీవుడ్ ని సైతం పక్కన బెట్టి టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ సక్సెస్ ల మీద సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇటీవలే 'లక్కీ భాస్కర్' తో మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తెలుగులోనే 'ఆకాశంలో ఒకతార' అనే మరో సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు 'కాంత' అనే తమిళ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో దుల్కర్ 40వ చిత్రం కూడా లాక్ అయింది.
సాబిన్ సాహిర్ దర్శకత్వంలో మాలీవుడ్ లో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. సాబిన్ సాహిర్ అంటే తెలుగు ఆడియన్స్ కు సుపరిచితుడే. 'మంజుమ్మల్ బోయ్స్' లో ఓ కీలక పాత్ర పోషించాడు. గుహాలోకి దిగి స్నేహితు డిని కాపాడే పాత్ర సాబిన్ పోషించాడు. సినిమాలో ఆ సన్నివేశాలు ఎంత హైలైట్ అయ్యాయో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడీ సాబిర్ దర్శకుడిగా రెండవ సినిమాని దుల్కర్ తో తెరకెక్కించడం విశేషం. దుల్కర్ అవకాశం ఇవ్వడం కూడా గొప్పవిషయం.
అదీ 40వ సినిమాకి సాబిన్ ను తీసుకోవడం అన్నది సాహసో పోతేమైన నిర్ణయమే. దర్శకుడిగా పెద్దగా అనుభవం లేదు. చేసింది ఒక్క సినిమా. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సాబిన్ కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు. ప్రాజెక్ట్ ను ఎలా డీల్ చేస్తాడు? అన్నది క్లారిటీ లేదు. కానీ దుల్కర్, సాబిన్ కథని నమ్మి అవకాశం ఇస్తున్నాడు. మేకర్ గా అతడి పని తనాన్ని 'పరవ'లో చూసాడు. ఆ నమ్మకంతోనే 40వ చిత్రం అతడి చేతుల్లో పెట్టినట్లు తెలుస్తోంది.
సాబిన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. అలాగే 'మంజుమ్మల్ బోయ్స్' చిత్రాన్ని పరవ ఫిల్మ్స్ పై తానే స్వయంగా నిర్మించా డు. మరి దుల్కర్ చిత్రాన్ని సాబిన్ స్వీయా దర్శకత్వంలో నిర్మిస్తున్నాడా? లేక కేవలం దర్శకుడిగానే బాధ్యతలు తీసుకుంటున్నాడా? అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం దుల్కర్ వివిధ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తి కాగానే 40వ చిత్రం పై పూర్తి క్లారిటీ వస్తుంది.