యూనిఫాంలో ముద్దు సీన్లపై కెప్టెన్ ఏమన్నాడంటే?
దీనిపై చిత్ర బృందం వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా ఈ వివాదంపై చిత్ర దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ స్పందించారు
By: Tupaki Desk | 10 Feb 2024 10:13 AM GMTఇటీవల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ఫైటర్' లోని హృతిక్ రోషన్-దీపికా పదుకొణే ముద్దు సీన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ఎయిర్ ఫోర్స్ అధికారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. యూనిఫాం లో ముద్దు సన్నివేశాల్లో నటించడం అన్నది దేశ రక్షణ వ్యవస్థ అయిన ఎయిర్ ఫోర్స్ ని అవమాన పరిచినట్లే అంటూ అస్సాంకి చెందిన వాయుసేన అధికారి సౌమ్యదీప్ దాస్ ఆరోపించారు.
దీనిపై చిత్ర బృందం వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. అయితే తాజాగా ఈ వివాదంపై చిత్ర దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ స్పందించారు. సినిమా సెన్సార్ పూర్తయ్యాక వాయుసేన అధికారులకు చూపించినట్లు తెలిపారు. 'ఎయిర్ ఫోర్స్ పై నాకు గౌరవం ఉంది. నిబంధనల మేరకే సినిమా తీసాం. స్క్రిప్ట్ నుంచి సెన్సార్ రిపోర్ట్ వరకూ ప్రతీ విషయం వాయుసేన అధికారులతో చర్చించే తీసాం. రిలీజ్ కి ముందు ఎయిర్ పోర్స్ చీప్ తో మాట్లాడాం.
వంద మంది అధికారులకు ముందే సినిమా చూపించాం. వాళ్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నాం. కానీ మాపై ఫిర్యాదు చేసినట్లు వచ్చింది. అసలు ఆ పేరుతో ఎయిర్ ఫోర్స్ లో ఎలాంటి అధికారి లేరని మా దృష్టికి వచ్చింది. ఇలా ఎవరు చేస్తున్నారో? మాకు అర్దం కాలేదంటూ' సిద్దార్ద్ తెలిపారు. మరి ఆయన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసిన సౌమ్య దీప్ దాస్ మళ్లీ తెరపైకి వస్తారా? అన్నది చూడాలి.
'ఫైటర్' సినిమా రిలీజ్ అనంతరం ఈ ఫిర్యాదు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అదే రిలీజ్ ముందు అయితే ఈ ఫిర్యాదు పెద్ద వివాదాస్పదంగా మారేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అది వసూళ్లపైనా ప్రభావం చూపించేది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా వాటిని అందుకోవడంలో మాత్రం విఫల మైంది. అంతక ముందు దీపికా పదుకొణే 'పఠాన్' లోని బేషరామ్ సాంగ్ లో కాషాయ రంగు బికినీ ఎంత వివాదం తెచ్చిపెట్టిందే తెలిసిందే.