Begin typing your search above and press return to search.

మోహన్ బాబు తప్పేం లేదు : సౌందర్య భర్త కీలక ప్రకటన

నటి సౌందర్య మరణంపై తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరోపణలు గుప్పించారు.

By:  Tupaki Desk   |   12 March 2025 4:36 PM IST
మోహన్ బాబు తప్పేం లేదు : సౌందర్య భర్త కీలక ప్రకటన
X

నటి సౌందర్య మరణంపై తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా జల్పల్లిలో ఉన్న ఒక ఫామ్ హౌస్‌ పై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదంలో అనవసరంగా మోహన్ బాబు పేరును ప్రస్తావనలోకి తీసుకొచ్చి కొన్ని చానెల్స్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా సౌందర్య భర్త రఘు స్పందించారు. హైదరాబాదులోని ఓ ప్రాపర్టీ విషయంలో సౌందర్య, మోహన్ బాబు పేర్లు అనవసరంగా లాగుతున్నారని ఆయన ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. “ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా భార్యకు చెందిన ఎలాంటి ఆస్తిని మోహన్ బాబు అక్రమంగా స్వాధీనం చేసుకోలేదు. మా కుటుంబానికి, మోహన్ బాబు గారికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేవు” అని స్పష్టం చేశారు.

సౌందర్య మరణానంతరం కూడా తనకు మోహన్ బాబుతో స్నేహం యధావిధిగా కొనసాగిందని, ఆమె కుటుంబ సభ్యులూ ఎప్పుడూ మోహన్ బాబుతో మంచి సంబంధాలు కొనసాగించారని చెప్పారు. “ఈ నిరాధార ఆరోపణలను నమ్మవద్దని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచురించకుండా ఉండాలని” ఆయన ఒక లేఖలో కోరారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

సౌందర్య తన మరణానికి కొద్దికాలం ముందు రఘు జీఎస్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం కోసం వెళ్తుండగా, ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోవడంతో ఆమె దురదృష్టవశాత్తూ మరణించారు.