Begin typing your search above and press return to search.

భంగిమ‌ల‌తో రెచ్చ‌గొడుతున్న హైప్రొఫైల్ న‌టి

ర‌క్తాంచ‌ల్ వెబ్ సిరీస్ తో పాపుల‌రైంది సౌంద‌ర్య శ‌ర్మ‌. డాక్ట‌ర్ల కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ డెంటిస్ట్ కం యాక్ట‌ర్ ఓటీటీలో అద‌ర‌గొడుతోంది

By:  Tupaki Desk   |   23 July 2024 3:15 AM GMT
భంగిమ‌ల‌తో రెచ్చ‌గొడుతున్న హైప్రొఫైల్ న‌టి
X

ర‌క్తాంచ‌ల్ వెబ్ సిరీస్ తో పాపుల‌రైంది సౌంద‌ర్య శ‌ర్మ‌. డాక్ట‌ర్ల కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ డెంటిస్ట్ కం యాక్ట‌ర్ ఓటీటీలో అద‌ర‌గొడుతోంది. ర‌క్తాంచ‌ల్ పార్ట్ 1, 2 లో త‌న‌ న‌ట‌న‌కు మంత్ర‌ముగ్ధులైపోయిన యూత్ నిరంత‌రం త‌న‌ను సోష‌ల్ మీడియాల్లో ఫాలో చేయ‌డం మొద‌లు పెట్టారు. అందుకు త‌గ్గ‌ట్టే సౌంద‌ర్య ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌తో మ‌తులు చెడే ఫోటోషూట్ల‌తో ఈ భామ మ‌రింత‌గా యువ‌త‌రానికి క‌నెక్ట‌యిపోయింది. వ‌రుస‌గా బోల్డ్ ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొట్టే ఈ బ్యూటీ ఇటీవ‌ల బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా మారింది. తాజాగా సౌంద‌ర్య షేర్ చేసిన మ‌రో హాట్ ఫోటోషూట్ షేక్ చేస్తోంది. ఈ ఫోటోషూట్ లో సౌంద‌ర్య అంద‌చందాలు మైండ్ బ్లాంక్ అయ్యే ట్రీటిస్తున్నాయి.

గ‌ర్ల్ ఇన్ బ్లూ.. ఇది క‌చ్ఛితంగా యూనిక్ అంటూ అభిమానులు మ‌ర్చిపోయేలా అదిరిపోయే భంగిమ‌తో హీటెక్కించింది సౌంద‌ర్య‌. ఈ ఎక్స్ క్లూజివ్ డిజైన‌ర్ లుక్ కి యూత్ ఫిదా అయిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో వెబ్ లో వైర‌ల్ గా దూసుకెళుతోంది. నిజానికి సౌందర్య సర్టిఫైడ్ డెంటిస్ట్ .. న‌ట‌న‌లోకి రాక‌ముందు ఢిల్లీలో ప్రాక్టీస్ చేసింది. కానీ న‌ట‌న అంటే ఉన్న పిచ్చితో ఇక్క‌డ హ‌ద్దుమీరి గ్లామ‌ర్ ఒల‌క‌బోతోంది. శృంగార ర‌స పాత్ర‌ల్లో ర‌క్తి క‌ట్టిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టే వెబ్ లో ఫోటోషూట్ల‌తోను విరుచుకుప‌డుతోంది.

త‌న వృత్తికి వ్య‌క్తిగ‌త కుటుంబ వ్య‌వ‌హారాల‌కు పూర్తిగా మిస్ మ్యాచ్ అయ్యే ప‌రిస్థితి ఉంది. డాక్టర్ లు, ఇంజనీర్, IAS లు ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చి బాలీవుడ్ లో పాపుల‌ర్ స్టార్ గా ఎదుగుతోంది. హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు చూసి తాను కూడా న‌టి అవ్వాల‌నుకుని ఇలా డేర్ చేసింది. అయితే కెరీర్ ప్రారంభించిన ఐదారేళ్ల‌కే ఈ భామ బాగా పాపుల‌రైంది. సౌందర్య 2017లో బాలీవుడ్ చిత్రం 'రాంచీ డైరీస్‌'తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. దీనిని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నిర్మించారు. ఆ త‌ర్వాత ర‌క్తాంచ‌ల్ సిరీస్ తో త‌న పేరు మార్మోగిపోయింది. కంట్రీ మాఫియా, క‌ర్మ యుధ్ అనే సిరీస్ ల‌లోను న‌టించింది. ఇటీవ‌ల‌బిజీ ఆర్టిస్టుగా కెరీర్ ని సాగిస్తోంది.