Begin typing your search above and press return to search.

దాదా సౌర‌వ్ గంగూలీ కాప్ స్టోరి.. ఫుల్ కామెడీలు!

ఇటీవల విడుదలైన ప్రమోషనల్ వీడియోలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన పాత్ర‌లో క‌నిపించాడు

By:  Tupaki Desk   |   18 March 2025 8:15 AM IST
దాదా సౌర‌వ్ గంగూలీ కాప్ స్టోరి.. ఫుల్ కామెడీలు!
X

నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ `ఖాకీ: ది బెంగాల్ చాప్టర్` ప్ర‌స్తుతం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ వీడియోలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన పాత్ర‌లో క‌నిపించాడు. దాదా పోలీసుగా మారారు. ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఇందులో కామెడీ మామూలుగా లేదు. అయితే ఇది అత‌డు న‌టించే సినిమానా లేక వెబ్ సిరీసా? అంటూ సందేహాలు అలానే ఉన్నాయి.

సోమవారం నాడు విడుదల చేసిన ప్రోమోలో గంగూలీ పోలీసు యూనిఫాంలో కనిపించ‌గానే ఫ్యాన్స్ లో ఒక‌టే ఉత్కంఠ. కానీ ఇది కేవ‌లం ప్ర‌చార వీడియో మాత్ర‌మే. దర్శకుడి సూచనలతో అత‌డు చాలా ర‌కాల‌ సన్నివేశాల్లో న‌టిస్తూ క‌నిపించాడు. దర్శకుడు దూకుడుగా ఉండమని అడిగినప్పుడు భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌తో తన గ‌త‌ చరిత్రను గుర్తు చేసుకున్నాడు. ఆ టైమ్ లో వెంట‌నే సీరియ‌స్ ఫేస్ తో క‌నిపించాడు. 2000లో కోచ్ చాపెల్ తో కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ బ‌హిరంగంగా గొడ‌వ ప‌డ్డాడు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ క్రికెట్ ప్రేమికులు, ప్ర‌జ‌ల‌కు బాగా తెలిసినందున ఇది వారి చారిత్రాత్మ‌క ఫైట్‌పై ఏదో ఒక ప్ర‌య‌త్నం అని అనుకోవాలి. సంవత్సరాలుగా చాపెల్ టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న కాలంలో భారత క్రికెట్‌పై చూపిన ప్రతికూల ప్రభావం గురించి గంగూలీ బహిరంగంగా మాట్లాడాడు.

అయితే ఆ వీడియోలో హీరో చేయాల్సిన పనులన్నీ దర్శకుడు గంగూలీకి చెబుతుంటే..ఇవన్నీ చేయడం తనవల్ల కాదని గంగూలీ అంటున్నాడు. చివ‌రికి దర్శకుడు.. మీరు మార్కెటింగ్‌ చేయండని అనడంతో గంగూలీ ఓకే అంటాడు. దీనిని బట్టి చూస్తే మాజీ క్రెకెటర్ గంగూలీ ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో మాత్రమే భాగమని అర్థం చేసుకోవాలి.

త్వ‌ర‌లోనే గంగూలీ జీవిత‌క‌థ‌తో డాక్యు సిరీస్ కూడా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఖాకీ ది బీహార్ చాప్ట‌ర్ కి కొన‌సాగింపుగా ఖాకీ ది బెంగాల్ చాప్ట‌ర్ తెర‌కెక్కింది.