సౌత్ లో సెట్స్ పైనున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలివే!
ప్రస్తుతం సౌత్‌లో పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలను స్టార్ హీరోయిన్లు చేస్తుంటే మరికొన్ని ఓ మోస్తరు క్రేజ్ ఉన్న వారు చేస్తున్నారు.
By: Tupaki Desk | 3 March 2025 4:00 PM ISTప్రస్తుతం సౌత్‌లో పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలను స్టార్ హీరోయిన్లు చేస్తుంటే మరికొన్ని ఓ మోస్తరు క్రేజ్ ఉన్న వారు చేస్తున్నారు. మొత్తానికి ఒక్కో సమస్యపై ఒక్కొకరు పోరాడటానికి హీరోయిన్లు రెడీ అయిపోయారు. వాటిలో మొదటిగా టాలీవుడ్ స్వీటీ అనుష్క నటిస్తున్న ఘాటీ మూవీ ఉంది.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుంధతి, రుద్రమదేవి, పంచాక్షరి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల్నిఆకట్టుకున్న స్వీటీ ఇప్పుడు ఘాటీతో ఆడియన్స్ ముందుకు రానుంది. బిజినెస్ లో ఎదుగుతున్న మహిళను కొందరు కావాలని ఓ కుట్రలో ఇరికిస్తే, ఆ కుట్ర నుంచి బయటడి శత్రువలను అంతం చేసి, ఎలా ఆ బిజినెస్ కు రాణిగా మారిందనే నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుందని టాక్ వినిపిస్తుంది.
ఇక సమంత లీడ్ రోల్ లో సొంత బ్యానర్ లో చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం. ఓ ఇల్లాలు కొన్ని అనుకోని కారణాల వల్ల గన్ పట్టుకోవాల్సి వస్తుంది. అసలు ఆమెకు ఎదురైన సమస్యలేంటనేది మూవీలోనే చూడాలి. అయితే అనౌన్స్‌మెంట్ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పటివరకు రాలేదు.
డాఫ్నే ష్మోన్ దర్శకత్వంలో శృతి హాసన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఇంటర్నేషనల్ మూవీ ది ఐ. వేరే దేశానికి వెళ్లిన తన భర్త చనిపోయాడని తెలుసుకుని అతని అంత్యక్రియలకు అక్కడకు వెళ్లిన భార్యకు కొన్ని షాకింగ్ విషయాలు తెలియడంతో తన భర్త బతికి ఉన్నాడేమో అనే డౌట్ వస్తుంది. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది.
ఇక ఊరి కోసం నాగ సాధువు ఎలాంటి సాహసాలు చేసిందనే నేపథ్యంలో తమన్నా చేసిన ఓదెల2 రూపొందుతుంటే, ఓ సాధారణ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లో కత్తి, బాంబు, తుపాకులు పెట్టుకుని తిరిగే కథతో కీర్తి సురేష్ నటిస్తున్న రివాల్వర్ రీటా తెరకెక్కుతుంది. విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న రష్మిక కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది.
ప్రేమలో పడకూడదనుకుంటూనే లవ్ చేసే ఓ కాలేజ్ స్టూడెంట్ కథతో ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమాతో పాటూ, రెయిన్ బో అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తుంది రష్మిక. ఊరి సంప్రదాయం, ఆచారం, కట్టుబాట్లు కోసం ఓ అమ్మాయి చేసే సాహసాల ప్రయాణంగా అనుపమ చేస్తున్న పరదా తెరకెక్కుతుంది. ఈ మూవీలో ఓ సామాజిక అంశాన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్పనున్నట్టు తెలుస్తోంది.
హ్యాపీ బర్త్ డే తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి చేస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీ సతీ లీలావతి. రీసెంట్ గా మొదలైన ఈ సినిమా ఏ జానర్ లో ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందనేది తెలియాల్సి ఉంది. బూమరాంగ్ అనే మూవీలో సైకో కిల్లర్ నుంచి ఓ యువతి ఎలా తప్పించుకుందనే కథలో అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తుంది.
పెళ్లైన ఓ యువతి తన ప్రాబ్లమ్స్ ను తానే ఎలా సాల్వ్ చేసుకుందనే కథ ద్వారా వరలక్ష్మీ శరత్ కుమార్ చూపించనుండగా, అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఎదిగేందుకు సహకరించాలి, సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలనే అంశాలతో రూపొందుతున్న సినిమా నారి. సీనియర్ నటి ఆమని ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. ఇవి కాక మరికొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సౌత్ లో సెట్స్ పై ఉన్నాయి.