Begin typing your search above and press return to search.

ఈ వారం చిత్రాలు.. కంటెంట్ లో ఏది బెస్ట్ అంటే..?

రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, ఎంపురాన్, వీర ధీర సుర మూవీలు సందడి చేశాయి. మరి ఆ సినిమాలు ఎలా ఉన్నాయి? వంటి పలు విషయాలపై అనాలిసిస్ మీకోసం..

By:  Tupaki Desk   |   29 March 2025 8:18 AM
ఈ వారం చిత్రాలు.. కంటెంట్ లో ఏది బెస్ట్ అంటే..?
X

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో వివిధ సినిమాలు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎగ్జామ్స్ టైమ్ అయినా.. పలు చిత్రాలు విడుదలయ్యాయి. రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్, ఎంపురాన్, వీర ధీర సుర మూవీలు సందడి చేశాయి. మరి ఆ సినిమాలు ఎలా ఉన్నాయి? వంటి పలు విషయాలపై అనాలిసిస్ మీకోసం..


అయితే ఈ వారం రిలీజ్ అయిన వాటిలో కంటెంట్ పరంగా బెస్ట్ ఆప్షన్ విక్రమ్ వీర ధీర శూర అని అంతా చెబుతున్నారు. తంగలాన్ తర్వాత విక్రమ్ నటించిన ఆ సినిమాను ఎస్ యూ అరుణ్ కుమార్ తెరకెక్కించారు. ఎస్ జే సూర్య, దుషార విజయన్ తదితరులు నటించిన ఆ మూవీ.. కంటెంట్, సినిమాటిక్ వాల్యూస్ పరంగా పర్వాలేదు అని అంటున్నారు.

అదే సమయంలో మూవీలో కాస్త తమిళ పైత్యం ఎక్కువైందని, అందుకే తెలుగు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించకపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. క్రిటిక్స్ కు పెద్దగా ఎక్కలేదు కానీ, ఒక వర్గం ఆడియన్స్ కు మాత్రం బాగా నచ్చిందని చెబుతున్నారు. ఖైదీ మూవీ అంత కాకపోయినా.. అలానే అనిపిస్తుందని అంటున్నారు.

అయితే నితిన్ రాబిన్ హుడ్, సూపర్ హిట్ మూవీ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వెంకీ కుడుముల రాబిన్ హుడ్ ను తెరకెక్కించగా.. మ్యాడ్ స్క్వేర్ కు కళ్యాణ్ శంకరే దర్శకత్వం వహించారు. రెండు సినిమాలకు కూడా తెలుగు ఆడియన్స్ నుంచి పర్వాలేదు కొన్ని నవ్వుల కోసం అనే టాక్ వస్తుంది అని చెప్పాలి. రెండు చిత్రాలు కూడా కొన్ని నవ్వులు పూయిస్తున్నాయి.

అదే సమయంలో రెండు మూవీల్లో కొన్ని నెగిటివ్స్ ఉన్నా.. కామెడీ పరంగా మాత్రం పర్వాలేదు అనే చెప్పాలి. స్టోరీ విషయంలో ఇంకాస్త వర్క్ చేయాల్సిందని రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు, మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఎంపురాన్ మూవీ.. భారీ హైప్, బిల్డప్ మధ్య రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

కానీ ఎంపురాన్ లో ఇప్పుడు బిల్డప్ ఎక్కువ, కంటెంట్ తక్కువ అని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఎన్నో అంచనాలు క్రియేట్ చేసినా.. వీక్ మూవీగా మారిందని చెబుతున్నారు. మోహన్ లాల్ కు ఉన్న క్రేజ్ వల్ల మాలీవుడ్, ఓవర్సీస్ లో వసూళ్లు గట్టిగానే వస్తున్నాయని అంటున్నారు. అదే మూవీ బాగుంటే బ్లాక్ బస్టర్ రేంజ్ లో దూసుకుపోయేదని అంచనా వేస్తున్నారు.

అయితే మాలీవుడ్ తోపాటు ఓవర్సీస్ లో ఎంపురాన్ కు కలెక్షన్లు బాగానే వస్తున్నాయన్నమాట. కానీ కంటెంట్ పరంగా చూసుకుంటే మాత్రం విక్రమ్ వీర ధీర శూరనే టాప్ అని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ అని చెబుతున్నారు. మరి మీరు ఏ ఏ సినిమాలు చూశారు? మీకు ఏది నచ్చింది?