ధూమ్ 4లో సౌత్ హీరో..?
'ధూమ్' సిరీస్ లో హీరో కంటే విలన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
By: Tupaki Desk | 16 Sep 2024 1:02 PM GMTబాలీవుడ్ యష్ రాజ్ ఫిలిమ్స్ ఎక్కువగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉంటుంది. వాటిలో ‘ధూమ్’ సిరీస్ ఒకటి. ఇండియాలో ఫస్ట్ ఫ్రాంచైజ్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు ‘ధూమ్’ సిరీస్ లో మూడు పార్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. 'ధూమ్' సిరీస్ లో హీరో కంటే విలన్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు ధూమ్ సిరీస్ లో విలన్స్ గా నటించారు.
‘ధూమ్’ మూవీలో జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. ‘ధూమ్ 2’లో హృతిక్ రోషన్ ప్రతినాయకుడిగా నటించి మెప్పించాడు. ఇక ‘ధూమ్ 3’లో అయితే అమీర్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించి మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమాలు ఆ స్టార్స్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. ‘ధూమ్’ సిరీస్ లో పార్ట్ 4కి యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా సిద్ధం అవుతున్నారు. స్పై థ్రిల్లర్ సిరీస్ తరహాలోనే ‘ధూమ్’ ఫ్రాంచైజ్ ని కూడా కొనసాగించాలని ఆదిత్య చోప్రా డిసైడ్ అయ్యారంట.
దీనికి కథ కూడా ఆయనే రాస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ‘ధూమ్ 4’కి దర్శకుడిగా అయాన్ ముఖర్జీని కన్ఫర్మ్ చేసినట్లు బిటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ‘ధూమ్ 4’ కోసం నిర్మాత ఆదిత్య చోప్రా సౌత్ ఇండియన్ స్టార్ సూర్యని సంప్రదించారంట. ఆయన కూడా క్యారెక్టర్ నచ్చి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రావొచ్చని ప్రచారం బిటౌన్ లో నడుస్తోంది.
ఇప్పటికే సూర్య ‘24’ మూవీలో విలన్ గా నటించాడు. అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీలో రోలెక్స్ క్యారెక్టర్ లో సందడి చేశాడు. ‘ధూమ్’ సిరీస్ అంటే క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. విలన్ పాత్ర అయిన హీరోయిజం ఉంటుంది. అలాగే మూవీలో చాలా సాహసాలు చేయాల్సి ఉంటుంది. సూర్య పెర్ఫార్మెన్స్ పరంగా అస్సలు ఒంక పెట్టాల్సిన పని లేదు. అయితే ఆ క్యారెక్టర్ వెయిట్ ని ఏ మేరకు మోయగలడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఒక వేళ సూర్య ‘ధూమ్ 4’లో నటిస్తే కచ్చితంగా ఆ సినిమాపై హిందీతో పాటు సౌత్ భాషలలో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఈజీగా ఆ మూవీ 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే సూర్య ఈ సినిమాలో నటించడం ఎంత వరకు వాస్తవం అనేది అధికారికంగా కన్ఫర్మ్ అయితే కానీ తెలియదు.