Begin typing your search above and press return to search.

వరల్డ్ మార్కెట్ లో బీటౌన్ హీరోలదే డామినేషన్.. మనోళ్లు కొట్టేదెప్పుడో?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్.. ఇది ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు దానిపై చర్చలు నడుస్తూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   31 Jan 2025 10:30 PM GMT
వరల్డ్ మార్కెట్ లో బీటౌన్ హీరోలదే డామినేషన్.. మనోళ్లు కొట్టేదెప్పుడో?
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్.. ఇది ఎప్పటి నుంచో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు దానిపై చర్చలు నడుస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఆ విషయంపై పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తుంటారు. అయితే ఒకప్పుడు సౌత్ సినిమాలు వేరు.. ఇప్పుడు వేరు.. పాన్ ఇండియా లెవెల్ లో అదరగొడుతున్నాయి.

సౌత్ ఇండియా సినిమాలు బాహుబలి-1,2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, పుష్ప-1,2.. ఇండియా వైడ్ గా వేరే లెవెల్ హిట్స్ గా నిలిచాయి. ఓ రేంజ్ లో వసూళ్లను రాబట్టాయి. నార్త్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. రీసెంట్ గా వచ్చిన పుష్ప-2: ది రూల్ చిత్రం.. నార్త్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

దీంతో బాలీవుడ్ మూవీ లవర్స్.. సౌత్ సినిమాలపై మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. దక్షిణాది చిత్రాలదే డామినేషన్ అని అర్థమవుతుంది. అదే సమయంలో ప్రపంచ మార్కెట్ లో బాలీవుడ్ హీరోలు ముందంజలో ఉన్నారని ఇప్పుడు బాక్సాఫీస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌత్ సినిమాలు హిట్ అవుతున్నా.. బీటౌన్ నటులదే ఆధిపత్యం ఉందని అంటున్నారు.

బాక్సాఫీస్ నిపుణుల ప్రకారం, ప్రపంచ మార్కెట్లో షారుఖ్ ఖాన్ రూ.2672 కోట్లతో (పఠాన్, జవాన్, డంకీ) ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత అమీర్ ఖాన్ రూ.2486 కోట్లతో (దంగల్, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, లాల్ సింగ్ చద్దా) ఉన్నారు. అనంతరం అల్లు అర్జున్ (రూ.2390 కోట్లు), ప్రభాస్ (రూ.2078 కోట్లు), జూనియర్ ఎన్టీఆర్ (రూ.1875 కోట్లు) ఉన్నారు.

ఆ తర్వాత వరుస స్థానాల్లో రణబీర్ కపూర్ (రూ.1580 కోట్లు), రామ్ చరణ్ (రూ.1569 కోట్లు), యష్ (రూ.1491 కోట్లు), విజయ్ (రూ.1375 కోట్లు), రజనీకాంత్ (రూ.1023 కోట్లు) ఉన్నారు. వీరంతా కూడా గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ ప్రపంచ మార్కెట్ లో బాలీవుడ్ హీరోల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దానికి కారణం కూడా ఉంది.

దంగల్, పఠాన్ వంటి పలు సినిమాలు.. విదేశాల్లో భారీ వసూళ్లను రాబట్టాయి. దానికి తోడు నార్త్ లో మల్టీప్లెక్సులు ఎక్కువగా ఉంటాయి. దీంతో భారీ కలెక్షన్లు వస్తాయి. కాబట్టి ఇప్పుడు సౌత్ సినిమాల స్థాయి అంతర్జాతీయ మార్కెట్లో ఇంకా మెరుగు పడాలి. అయితే సౌత్ లో మరిన్ని భారీ సినిమాలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ లో ప్రపంచ దేశాల్లో మంచి వసూళ్లు రాబట్టి బాలీవుడ్ హీరోలను సౌత్ నటులు డామినేట్ చేసే అవకాశం ఉంది.