Begin typing your search above and press return to search.

వాళ్లంద‌రికీ 2025 సీక్వెల్స్ స‌మ‌రం!

ఇంకా మ‌రిన్ని సీక్వెల్స్ ప్ర‌చారం లో ఉన్నాయి. ఏడాది మిడ్ లేదా? ముగింపుకు ప్రారంభించి వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Jan 2025 2:45 PM GMT
వాళ్లంద‌రికీ 2025 సీక్వెల్స్  స‌మ‌రం!
X

సాధార‌ణంగా సీక్వెల్స్ అంటే ఎక్కువ‌గా బాలీవుడ్ నుంచే రిలీజ్ అవుతుంటాయి. ద‌శాబ్ధం..రెండు దశాబ్దం క్రితం నాటి క‌థ‌ల‌కు సీక్వెల్స్ తెర‌కెక్కించ‌డం అన్న‌ది బాలీవుడ్ కే చెల్లింది. ఇప్పుడా ట్రెండ్ సౌత్ కి పాకింది. అయితే ఇక్క‌డ కొంచెం భిన్నం. ఒకే క‌థ‌ను రెండు భాగాలుగా విభ‌జించి చెప్ప‌డం జ‌రుగుతోంది. 'బాహుబ‌లి', 'పుష్ప' లాంటి క‌థ‌ల్ని అలాగే చెప్పారు. 'దేవ‌ర' ని కూడా రెండు భాగాలుగా చెబుతున్నారు.

ఎస్ ఎస్ ఎంబీ 29 కూడా ఇదే త‌ర‌హాలో ఉంటుంద‌నే ప్ర‌చారంలో ఉంది. ఇక కోలీవుడ్ నుంచి అయితే? సీక్వెల్స్ బాలీవుడ్ పంథాలోనే క‌నిపిస్తున్నాయి. 'జైల‌ర్' కి సీక్వెల్ గా నెల్స‌న్ దిలీప్ కుమార్ 'జైల‌ర్ -2' ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. 'జైల‌ర్' రిలీజ్ అనంత‌రం రెండ‌వ భాగం ప‌నుల్లోనే బిజీ అయ్యాడు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా ఉత్సాహంగా ఉండ‌టంతో? ఏమాత్రం మ‌రో ఆలోచ‌న లేకుండా సీక్వెల్ పై ప‌ని చేస్తున్నాడు.

అలాగే శంక‌ర్ -క‌మ‌ల్ హాస‌న్ 'ఇండియన్ -3' కూడా ఇదే రిలీజ్ అవుతుంది. 'భార‌తీయుడు' సీక్వెల్ గా రిలీజ్ అయిన ఇండియ‌న్ -2 ఫెయిలైనా? మూడ‌వ భాగం విష‌యంలో శంక‌ర్-క‌మ‌ల్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇదే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స్టార్ హీరో కార్తీ న‌టించిన 'స‌ర్దార్' మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడా సినిమాకి సీక్వెల్ గా 'స‌ర్దార్ -2' తెర‌కెక్కుతోంది. ఇది స్పై థ్రిల్ల‌ర్ చిత్రం. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతున్న చిత్ర‌మిది.

అలాగే 'ఖైదీ-2'ని కూడా ఇదే ప్రారంభించాల‌ని ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్లాన్ చేస్తున్నాడు. సూర్య హిట్ ప్రాంచైజీ 'సింగం 'గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ మూడు భాగాలుగా రిలీజ్ అయిన 'సింగం' గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఈ నేప‌థ్యంలో నాల్గ‌వ భాగాన్ని ఇదే ఏడాది ప‌ట్టాలెక్కించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంకా మ‌రిన్ని సీక్వెల్స్ ప్ర‌చారం లో ఉన్నాయి. ఏడాది మిడ్ లేదా? ముగింపుకు ప్రారంభించి వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.