సూర్యకు చేదు అనుభవం.. అందరి ముందు నిలదీయడంతో..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా మూవీతో మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2024 5:57 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. కంగువా మూవీతో మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారు. కంగ, ఫ్రాన్సిస్ గా సినిమాలో తన యాక్టింగ్ తో అలరించనున్నారని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
పదికి పైగా భాషల్లో నవంబర్ 14వ తేదీన రిలీజ్ కానున్న కంగువా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ కొట్టాలని సూర్య గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు గాను పెద్ద ఎత్తున సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఓ రేంజ్ లో ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక సినిమాకు హీరోగా ఎంత చేయాలో అంతకు మించే సూర్య చేశారని చెప్పాలి.
అయితే తాజాగా మేకర్స్ ముంబైలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యకమానికి వివిధ మీడియాకు చెందిన ప్రతినిధులు వచ్చారు. కానీ సూర్య మాత్రం ఆలస్యంగా వచ్చారు. దీంతో ఓ జర్నలిస్ట్ అసహనం వ్యక్తం చేశారు. నేరుగా సూర్యను నిలదీసే ప్రయత్నం చేశారు! ఇప్పుడు సమయం ఎంత? మీరు మమ్మల్ని ఎంత సేపు వెయిట్ చేయిస్తారని ప్రశ్నించారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న పలువురు.. సదరు జర్నలిస్ట్ ను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సూర్య కూడా ఆయనకు నచ్చజెప్పారు. ఆ తర్వాత వేదికపైకి వెళ్లాక మీడియా నుంచి క్షమాపణలు కోరారు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని అభ్యర్థించారు. ట్రాఫిక్ కారణమని సాకులు చెప్పనని, మీ అందరి సమయానికి తాను విలువనిస్తానని తెలిపారు.
సమయాన్ని తాను నియంత్రించలేకపోయానని, మీడియా నుంచి నిరంతర మద్దతుతో పాటు ప్రేమను కోరుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు స్పందిస్తున్నారు. సూర్య గోల్డెన్ హార్ట్ అని కొనియాడుతున్నారు. సారీ చెప్పి మనసులు మళ్లీ గెలిచావన్న అని అంటున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. అత్యంత భారీ బడ్జెట్ తో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కోలీవుడ్ బాహుబలి అంటూ కంగువాను ప్రమోట్ చేస్తున్నాయి. సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ మూవీతో సూర్య ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.