Begin typing your search above and press return to search.

సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023: RRR కు 8 అవార్డ్స్, బెస్ట్ హీరో ఎవరంటే?

RRR చిత్రంలో అద్భుతమైన నటన కనరిచిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు 68వ ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపిక అయ్యారు.

By:  Tupaki Desk   |   12 July 2024 4:38 AM GMT
సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023: RRR కు 8 అవార్డ్స్, బెస్ట్ హీరో ఎవరంటే?
X

సౌత్ లో ప్రతిష్టాత్మంగా భావించే సినీ పురస్కారాల్లో 'ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్' కూడా ఒకటి. ప్రతీ ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన దక్షిణాది నటీనటులు, సాంకేతికత నిపుణులను గుర్తించి అవార్డులను ప్రధానం చేస్తూ వస్తున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల గతేడాది ఈ అవార్డులను నిర్వహించలేదు. తాజాగా 2023 సంవ‌త్స‌రానికి గాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలను సంబంధించిన సౌత్ ఫిలింఫేర్ అవార్డుల‌ను డిజిటల్ గా ప్ర‌క‌టించారు. తెలుగులో RRR సినిమా 8 అవార్డులతో సత్తా చాటింది. అలానే 'సీతారామం' సినిమా 5 అవార్డులు, 'విరాట ప‌ర్వం' మూవీ 2 అవార్డులు గెలుచుకున్నాయి.

RRR చిత్రంలో అద్భుతమైన నటన కనరిచిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు 68వ ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపిక అయ్యారు. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా 'ఆర్.ఆర్.ఆర్' సినిమా అవార్డులు సాధించాయి. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి నిలవగా.. ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నిలిచారు. ఉత్తమ నటిగా 'సీతారామం' హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ అవార్డ్ సొంతం చేసుకోగా.. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా సాయి పల్లవి (విరాటపర్వం) అవార్డు గెలుచుకుంది. సాయి పల్లవి తమిళంలో 'గార్గి' చిత్రానికి గానూ ఉత్తమ నటి అవార్డ్ కు ఎంపికైంది.

68వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ సౌత్-2023 విజేతలు (తెలుగు):

ఉత్త‌మ చిత్రం - RRR

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - రాజ‌మౌళి (RRR)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం

బెస్ట్ యాక్ట‌ర్ (మేల్) - జూనియ‌ర్ ఎన్టీఆర్ & రామ్ చ‌ర‌ణ్‌ (RRR )

బెస్ట్ యాక్ట‌ర్ (క్రిటిక్స్) - దుల్క‌ర్ స‌ల్మాన్ (సీతారామం)

బెస్ట్ యాక్ట‌ర్‌ (ఫీమేల్) - మృణాల్ ఠాకూర్ (సీతారామం)

బెస్ట్ యాక్ట్రెస్ (క్రిటిక్స్) - సాయి ప‌ల్ల‌వి (విరాట ప‌ర్వం)

ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయ‌క్)

ఉత్త‌మ స‌హాయ న‌టి - నందితా దాస్ (విరాట ప‌ర్వం)

బెస్ట్ మ్యూజిక్ అల్బ‌మ్ - ఎం.ఎం. కీర‌వాణి (RRR)

బెస్ట్ లిరిక్స్ - సిరివెన్నెల సీతారామ శాస్త్రి ('కానున్న కళ్యాణం' - సీతారామం)

బెస్ట్ ప్లేబాక్ సింగ‌ర్ (మేల్) - కాల భైర‌వ ('కొమ‌రం భీముడో' - RRR)

బెస్ట్ ప్లే బ్యాక్ సింగ‌ర్ (ఫిమేల్) - చిన్మ‌యి శ్రీపాద ('ఓ ప్రేమా' - సీతారామం)

బెస్ట్ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు-RRR)              

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు సిరిల్ (RRR)  

బెస్ట్ సినిమాటోగ్ర‌ఫీ - సెంథిల్‌ (RRR) & ర‌వి వర్మ‌న్‌ (పొన్నియన్ సెల్వన్)