తెలుగు హీరోలు నికిలీలు అనేశాడు!
అతడు దక్షిణాది స్టార్లు మహేష్, ఎన్టీఆర్, దేవరకొండలను నకిలీ అని కామెంట్ చేసాడు. అసలింతకీ ఏ విషయంలో మన స్టార్లు నకిలీ? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
By: Tupaki Desk | 9 Jun 2024 4:58 AM GMTఅవును..! దక్షిణాది హీరోలు నకిలీ.. ఆ విషయంలో బాలీవుడ్ హీరోలే ఉత్తమం! అని వ్యాఖ్యానించాడు ప్రముఖ బాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ విరేందర్ చావ్లా. నిరంతరం బాలీవుడ్ సహా ఇతర సినీపరిశ్రమలకు చెందిన ఫోటోషూట్లతో బిజీగా ఉండే విరేందర్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అతడు దక్షిణాది స్టార్లు మహేష్, ఎన్టీఆర్, దేవరకొండలను నకిలీ అని కామెంట్ చేసాడు. అసలింతకీ ఏ విషయంలో మన స్టార్లు నకిలీ? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
పాపులర్ బాలీవుడ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ వరీందర్ చావ్లా ఇటీవల షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ సహా పలువరు స్టార్ల గురించిన రహస్యాలను వెల్లడిస్తూ తెరపై లేదా తెర వెలుపల వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిపాడు. సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్స్‌పై కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసాడు. నిజానికి బాలీవుడ్ తారలు కనీసం ఫేక్ కాదు..వారు వినయంగా నటించరని ఆయన పేర్కొన్నారు. సౌత్ సూపర్‌స్టార్లు వినయం నటిస్తారని అన్నాడు.
దక్షిణాది నటులు నకిలీ వినయం ప్రదర్శిస్తారనేది చావ్లా అభిప్రాయం. ఇటీవల ఎన్టీఆర్ తన వీడియో షూట్ చేస్తున్నప్పుడు మా టీమ్‌పై మండిపడ్డారు... వారు వినయంగా నటిస్తున్నారని నేను భావిస్తున్నాను అని అభిప్రాయపడ్డారు. అడివి శేష్ మేజర్ కార్యక్రమానికి హాజరైన మహేష్ బాబు ''మాకు బాలీవుడ్ అవసరం లేదు.. వారు నన్ను భరించలేరు'' అని వ్యాఖ్యానించడాన్ని అతడు తప్పు పట్టాడు. మహేష్ వినయంపై సందేహాలు లేవనెత్తాడు ఫోటోగ్రాఫర్ విరేందర్ చావ్లా. ప్రచార వేదికపైకి చెప్పులతో రావడం వినయం కాదని విజయ్ దేవరకొండపైనా విరేందర్ కామెంట్ చేసారు. వీళ్లు బాగా నకిలీ తరహా అని అన్నాడు. వినయవిధేయతల పరంగా చూస్తే.. బాలీవుడ్ తారలు నిజాయితీపరులు. కోపం వచ్చినా దాచుకోరు. అలా ఉండటం ప్రామాణికమైనది.. అని విరేందర్ వ్యాఖ్యానించాడు. సౌత్ స్టార్స్ అయితే వినయంగా నటిస్తారని అన్నారు.
రణబీర్ ఫోన్ లాక్కుని తిట్టాడు!
మా ఫోటోగ్రాఫర్లతో బాలీవుడ్ తారలు ప్రేమ లేదా ద్వేషపూరిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. చాలా మంది ఫోటోషూట్లను ఇష్టపడినా కానీ, కొందరు తమ గోప్యత ఉల్లంఘన గురించి పదే పదే ఆందోళన చెందారు. ఇటీవల రణబీర్ కపూర్ తన ఫోటోగ్రాఫర్లలో ఒకరి నుంచి ఫోన్ లాక్కున్నారని వెల్లడించాడు. వరీందర్ చావ్లా 'రష్' అనే యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ రణబీర్ తన ఫోటోగ్రాఫర్ ఫోన్‌ను లాక్కున్నాడని, అతడి బాస్‌కు తెలియజేయమని అడిగాడని కూడా తెలిపారు. రణబీర్‌ను చావ్లా సంప్రదించగా బాగా తిట్టాడు. ఆ తరువాత తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి పిలిచి తన గోప్యతను గౌరవించమని కోరాడు.. అని తెలిపాడు.
10-12 సంవత్సరాల క్రితం మా ఫోటోగ్రాఫర్‌లలో ఒకరు రాత్రిపూట ఫోటో కోసం రణబీర్‌ని అనుసరిస్తున్నారు. రణబీర్ ఎక్కడికో వెళుతున్నాడు.. అతను ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు.. కానీ అతడు కారును ఆపి..ఇక్కడ ఏమి చేస్తున్నావు? ఎందుకు అనుసరిస్తున్నావు? ఎవరి కోసం పనిచేస్తున్నావు? అని అడిగాడు. రణబీర్ అతడి ఫోన్ లాక్కుని, నాతో మాట్లాడటానికి మీ యజమానికి కాల్ చేయండి అని చెప్పాడు. కాబట్టి అతను నాకు మరొక నంబర్ నుండి కాల్ చేసి 'రణ్‌బీర్ కపూర్ నా ఫోన్ తీసుకున్నాడు' అని చెప్పాడు! అని వరీందర్ చెప్పారు. నేను కాల్ చేయగానే తిట్టాడు. మళ్లీ తెల్లవారు ఝామున ఫోన్ చేసి గోప్యతను గౌరవించమని చెప్పాడు! అని విరేందర్ చావ్లా అన్నారు.
గత ఏడాది నవంబర్‌లో కూడా రణబీర్ కపూర్ స్టిల్ ఫోటోగ్రాఫర్లపై కోపంగా కనిపించాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో కెమెరామెన్లు అతడిని పోజు ఇవ్వమని కోరినప్పుడు తన కారు వైపు నడుస్తూ వెళ్లాడు. దీపావళి వేళ అతడు సీరియస్ గా కనిపించాడు అని విరేందర్ వెల్లడించారు.