Begin typing your search above and press return to search.

ఖాన్‌ల‌ను వెన‌క్కి నెట్టే ఏకైక ద‌క్షిణాది హీరో

బాహుబ‌లి ప్ర‌భాస్ పై చాలా కాలంగా ప్ర‌జ‌ల్లో కొన్ని సందిగ్ధ‌త‌లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని సందిగ్ధ‌త‌లు, సందేహాలు ప‌టాపంచ‌లు అయ్యాయి

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:45 AM GMT
ఖాన్‌ల‌ను వెన‌క్కి నెట్టే ఏకైక ద‌క్షిణాది హీరో
X

బాహుబ‌లి ప్ర‌భాస్ పై చాలా కాలంగా ప్ర‌జ‌ల్లో కొన్ని సందిగ్ధ‌త‌లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని సందిగ్ధ‌త‌లు, సందేహాలు ప‌టాపంచ‌లు అయ్యాయి. ''బాహుబ‌లి ఫ్రాంఛైజీ చిత్రాలు ఏదో ఫ్లూక్ లో రిలీజై పెద్ద హిట్ట‌యిపోయాయి. అది రాజ‌మౌళి ఘ‌న‌త మాత్ర‌మే..'' అని భావించేవారికి ప్ర‌భాస్ ప్రాక్టిక‌ల్ గా స‌మాధానం ఇచ్చాడు. రాజ‌మౌళితో సంబంధం లేకుండా స‌రైన కంటెంట్ ప‌డితే ప్ర‌భాస్ లాంటి క‌టౌట్ ఉన్న హీరోకి కేవ‌లం ద‌క్షిణాదిలోనే కాదు ఉత్త‌రాదినా అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డుతుంద‌ని, భాష ప్రాంతంతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ని టిప్ప‌ర్ లారీ గుద్దేస్తుంద‌ని ప్రూవైంది.

బాహుబ‌లి-బాహుబ‌లి 2- సాహో- స‌లార్ ల‌కు హిందీలో అద్భుత వ‌సూళ్లు ద‌క్కాయి. ఓపెనింగుల ప‌రంగా ఆదిపురుష్ (డే వ‌న్ లో 36 కోట్లు-హిందీలో) కూడా ఉత్త‌రాదిన అద్భుతాలు చేసింది. ఖాన్‌ల‌తో పోటీప‌డే వెన‌క్కి నెట్టే స‌త్తా ఉన్న ఏకైక ద‌క్షిణాది హీరో డార్లింగ్ ప్ర‌భాస్ అని ప్రూవైంది. 100 నుంచి 150 కోట్లు ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌తో దేశంలోనే అజేయ‌మైన పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌భాస్ నిరూపించుకున్నాడు.

ఇప్పుడు స‌లార్ కూడా 175 కోట్ల ఓపెనింగ్ డే వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించింది. షారూఖ్ ఖాన్ లాంటి బాలీవుడ్ అగ్ర హీరో పోటీలో ఉన్నా కానీ ప్ర‌భాస్ ఇంత పెద్ద మొత్తం వ‌సూళ్ల‌ను తేగ‌లిగాడు. ఇందులో మెజారిటీ షేర్ హిందీ బెల్ట్ నుంచే వ‌చ్చింది. స‌లార్ ఇప్ప‌టికే రెండవ వారాంతంలోకి ప్రవేశించింది. ఊహించిన విధంగా రెండవ శనివారం వృద్ధిని సాధించింది. ఇప్ప‌టికీ హిందీ బెల్ట్ లో రోజూ 10 కోట్ల రేంజులో వ‌సూలు చేస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రానికి షారూఖ్ ఖాన్ డంకీ పోటీనిచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంతృప్తిక‌ర ఫ‌లితాన్ని ద‌క్కించుకున్నాయి. కానీ ఇప్పటికీ స్క్రీన్‌ల విభజన కారణంగా హిందీ బెల్ట్‌లో ఒకరి వ్యాపారాన్ని మ‌రొకరు దెబ్బతీసుకున్నార‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. అన్ని భాషల వసూళ్లను పరిశీలిస్తే ప్రభాస్ నటించిన స‌లార్ డంకీ కంటే చాలా ముందంజ వేసింది. తెలుగు వెర్షన్ ఇప్ప‌టికీ అద్భుతాలు చేస్తోంది.

సలార్ 9వ రోజు 11-13 కోట్లు వ‌సూలు చేసింది. ఈ ఆదివారం మ‌రో 15-20కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా. 9 రోజుల్లో భారతీయ బాక్సాఫీస్ వద్ద స‌లార్ 328-330 కోట్ల మ‌ధ్య షేర్ (550కోట్ల గ్రాస్) వసూలు చేసింది. ఐసోలేషన్‌లో చూస్తే ఇది ఘనమైన మొత్తం. నిజానికి డంకీతో క్లాష్‌లో విడుదల చేయకుంటే ఈ మొత్తం ఇంకా చాలా ఎక్కువగా పెరిగి ఉండేదని కూడా అంచ‌నా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది.

హిందీ వెర్షన్‌లో సెంచరీ కొట్టిన సాలార్!

హిందీలో ప్రభాస్ తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. మిశ్రమ సమీక్షలు , డంకీ నుంచి పోటీ ఉన్నప్పటికీ సలార్ హిందీ డబ్బింగ్ వెర్షన్‌తో కేవలం 8 రోజుల్లోనే సెంచరీ సాధించింది. ఇది కేవ‌లం హిందీ బెల్టులో 150 కోట్ల మైలురాయిని అందుకుంటోంది.