టాప్ స్టోరి: సౌతిండియా అగ్ర హీరోల విద్యార్హతలు
ఎంపిక చేసుకున్న వృత్తిలో రాణించడమే ఒక పీ.హెచ్.డి. కానీ కళారంగంలో ప్రతిభని నిరూపించుకోవడంతో పాటు డిగ్రీలు సాధించిన స్టార్లు మనకు ఉన్నారు.
By: Tupaki Desk | 18 Sep 2023 2:30 AM GMTఎంపిక చేసుకున్న వృత్తిలో రాణించడమే ఒక పీ.హెచ్.డి. కానీ కళారంగంలో ప్రతిభని నిరూపించుకోవడంతో పాటు డిగ్రీలు సాధించిన స్టార్లు మనకు ఉన్నారు. సౌతిండియా స్టార్లలో గ్రాడ్యుయేషన్ ఎంత మంది పూర్తి చేసారు? ఉన్నత విద్యార్హతలు ఉన్న స్టార్ల గురించి ఆరా తీస్తే తెలిసిన సంగతులివి...
లెజెండరీ కథానాయకుడు నందమూరి తారక రామారావు డిగ్రీ పూర్తి చేసారు. పిల్లలు ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత సాధారణంగా పాఠశాలకు పంపకపోయినా.. కుటుంబంలో మొదటి మగ సంతానం కాబట్టి ఎన్టీ రామారావును అతని తండ్రి విజయవాడకు పంపి చదివించారు. అక్కడ ఎన్.టి.రామారావు తన విద్యను కొనసాగించారు.1940లో మెట్రిక్యులేట్ చేసి SRR & CVR కళాశాలలో ఇంటర్ చదివారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసారు. చదువుల తరవాత గుంటూరు ప్రత్తిపాడులో సబ్ రిజిస్ట్రార్ గాను తారక రామారావు పని చేసారు. అటుపై నటుడయ్యాక కథంతా తెలిసిందే. నటశిఖరం అక్కినేని నాగేశ్వరరావు నటనపై మక్కువతో పదవతరగతితోనే విద్యను ముగించి సినిమాల్లోకి వచ్చారు. సూపర్ ప్టార్ కృష్ణ సి. ఆర్ కాలేజీలో డిగ్రీ చేసారు. అక్కినేని నాగార్జున అమెరికాలోని ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సీటీలో ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేసారు. అందులో ఎమ్మెస్ కూడా పూర్తిచేసారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి నరసాపురం వైఎం కాలేజీలో బికాం డిగ్రీ పూర్తి చేసారు. నటుడయ్యాక ఇంతింతై అన్నచందంగా స్వయంకృషితో ఎదిగిన చిరు టాలీవుడ్ ని ఎదురేలేని హీరోగా ఇప్పటికీ ఏల్తున్నారు. ఆయనతో కలిసి చదువుకున్నవారిలో చాలా మంది డాక్టర్లు ఇంజినీర్లు పారిశ్రామిక వేత్తలుగాను ఎదిగారు. దగ్గుబాటి కాంపౌండ్ లో విక్టరీ వెంకటేష్ అమెరికాలో మానిటరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో ఎంబిఏ పూర్తి చేసారు. ఇక నటసింహా బాలకృష్ణ హైదరాబాద్ నిజాం కాలేజీ నుంచి కామర్ప్ పట్టా పొందారు. అలాగే రాజశేఖర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్స్ట్ లో డిగ్రీ చేసారు. స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్ ఆర్ కాలేజీలో పూర్తి చేసారు. డార్లింగ్ ప్రభాస్ భీమవరం డీఎన్ ఆర్ స్కూల్లో చదివాక శ్రీ చైతన్యలో బీటెక్ పూర్తి చేశారు. సూపర్ స్టార్ మహేష్.. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. యువ సామ్రాట్ నాగచైతన్య లు బికాం స్టడీస్ కామ్ గా పూర్తి చేసారు. జూనియర్ ఎన్టీఆర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఇంటర్మీడియట్ పూర్తి చేసారు.
రానా దగ్గుబాటి (రామానాయుడు దగ్గుబాటి) బాహుబలిలో భళ్లాలదేవగా ప్రతినాయకుడిగా గుర్తింపు పొందాడు. ప్రాథమికవిద్యను చెట్టినాడ్ విద్యాశ్రమంలో చదువుకుని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు. హైదరాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజీలో బి.కామ్‌లో చేరాడు కానీ రెండు నెలల తర్వాత చదువు మానేశాడు. చెన్నై ఫిల్మ్ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో పట్టభద్రుడయ్యాడు.
నేటితరం స్టార్లు పీజీలు బిజినెస్ స్కూల్ స్టడీస్ పూర్తి చేసి పెద్ద ఉద్యోగాలు చేసి సినీరంగంలోకి వచ్చిన వాళ్లు ఉన్నారు. చాలా మంది డిగ్రీలతో పని లేకుండా స్టార్లుగా రాణిస్తున్నారు. నిజం చెప్పాలంటే కొందరికి సినీరంగంలోనే టెన్త్ ఇంటర్ డిగ్రీ పీహెచ్ డి అన్నీ పూర్తవుతున్నాయి. పీహెచ్ డిలు పూర్తి చేసిన డాక్టర్ల కంటే యాక్టర్లకు ఉండే అసాధారణ ఫాలోయింగ్ గురించి తెలిసిందే.
తమిళ స్టార్ల విద్యార్హతలు
తలైవా రజనీకాంత్ నటనలో వృత్తిని సంపాదించడానికి ముందు కూలీ..ఆ తర్వాత బస్ కండక్టర్‌గా పనిచేశాడు. రజనీ అల్లుడు, స్టార్ హీరో ధనుష్ తన పాఠశాల విద్యను పూర్తి చేయకముందే నటనలోకి ప్రవేశించాడు. కార్తీ నటుడిగా మారడానికి ముందు విదేశీ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ చేశాడు.
సూర్యగా పాపులరైన శరవణన్ శివకుమార్ తమిళ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. అతడు తన పాఠశాల విద్యను పద్మా శేషాద్రి బాల భవన్ స్కూల్ - చెన్నైలోని సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదివాడు. అతడు చెన్నైలోని లయోలా కళాశాల నుండి బి.కామ్ డిగ్రీని కూడా పొందాడు. సూర్య నటుడిగా మారడానికి ముందు పోస్ట్-ఎఫెక్ట్స్ - VFX నిర్మాతగా పనిచేశాడు. తన నటనా నైపుణ్యాలను మెరుగుపర్చడానికి, అతను బారీ జాన్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌కు వెళ్లాడు. అతను స్టంట్ అకాడమీ నుండి కూడా శిక్షణ పొందాడు.
కార్తీక్ శివకుమార్ తన రంగస్థల పేరు కార్తీ అని పిలుస్తారు. తన ప్రాథమిక - మాధ్యమిక పాఠశాల విద్యను పద్మా శేషాద్రి బాల భవన్ - సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్, చెన్నైలో పూర్తి చేశారు. అతను చెన్నైలోని క్రెసెంట్ ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, అతడు స్కాలర్‌షిప్ పొందాడు. న్యూయార్క్‌లోని బింగ్‌హామ్‌టన్ విశ్వవిద్యాలయం నుండి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదివాడు.
జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ని విజయ్ అని పిలుస్తారు. అతడు దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు. అతను తన 10 సంవత్సరాల వయస్సులో తన కెరీర్‌ను ప్రారంభించాడు . చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగాడు. విజయ్ మొదట కోడంబాక్కంలోని ఫాతిమా మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు. తరువాత విరుగంబాక్కంలోని బాలలోక్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చేరాడు. అతడు లయోలా కాలేజ్ నుండి విజువల్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీని అభ్యసించాడు. అయితే నటనపై ఎక్కువ ఆసక్తి చూపడంతో చదువును విడిచిపెట్టాడు.