సౌత్ క్వీన్ త్రిష@21 ఏళ్లు!
ఇప్పటికీ అదే ఛరిష్మాతో...కాదు కాదు అంతకు మించిన ఛరిష్మాతో మార్కెట్ లో దూసుకు పోతుంది.
By: Tupaki Desk | 16 Dec 2023 5:35 AM GMTసౌత్ క్వీన్ గా పేరొందిన త్రిష సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్..టాలీవుడ్ లో నటిగా తనదైన ముద్ర వేసింది. అమ్మడి వయసు నాలుగు పదులు దాటినా! త్రిష క్రేజ్ ఇసుమొత్తు కూడా కరగలేదు. ఇప్పటికీ అదే ఛరిష్మాతో...కాదు కాదు అంతకు మించిన ఛరిష్మాతో మార్కెట్ లో దూసుకు పోతుంది. `పొన్నియన్ సెల్వన్` లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో అమ్మడి పేరు పాన్ ఇండియాలోనే మారుమ్రోగిపోయింది.
వయసుతో ఆటు అందం కూడా అంతకంతకు రెట్టింపు అవుతుందనిపించిన ఏకైక బ్యూటీ. ఆ బ్యూటీకి సోషల్ మీడియాలో అంతటి పాపులారిటీని తెచ్చి పెట్టింది. వాస్తవానికి త్రిష నెట్టింట పెద్దగా యాక్టివ్ గా ఉండదు. కానీ సొగసరి హాజరైన ఈవెంట్ ఫోటులు..షాట్స్ వంటివి నెట్టింట జరిగే ప్రచారంతోనే అంతటి ఘనకీర్తిని దక్కించుకుంటుంది. ఇక నిజంగా అమ్మడు సోషల్ మీడియా ప్రచారంపై దృష్టి పెడితే ఇంకే రేంజ్ లో పాపురల్ అవుతుందో చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా త్రిష సినీ ఇండస్ట్రీలో రెండు దశాబ్ధాల ప్రయాణాన్ని పూర్తిచేసుకుని 21వ వసంతంలోకి అడుగు పెట్టేసింది. తొలిసారి త్రిష `మౌనం పెసియదే` అనే సినిమాని తెలుగులో` ఆడంటే అదో టైప్` అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. 2002 డిసెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ అయింది. అందులో అమమడు సూర్య కి జోడీగా నటించింది. అంతకు ముందు `జోడీ` అనే చిత్రంలో హీరోయిన్ ప్రెండ్ పాత్ర పోషించిం ది. అయితే హీరోయిన్ గా డెబ్యూ మాత్రం సూర్య చిత్రమే. అప్పటి నుంచి త్రిష కెరీర్ లో వెనక్కి చూడకుండా సాగిపోయింది.
వరుస విజయాలు త్రిష స్థాయిని అంతకంతకు తారా స్థాయికి తీసుకెళ్లాయి. తెలుగులో తొలి చిత్రం `వర్షం`. ఈసినిమా అప్పట్లో ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పటి నుంచి త్రిష దూకుడు టాలీవుడ్ లోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల పాటు రెండు భాషల్లోనూ తిరుగు లేని నాయికగా ముందుకు సాగిపోయింది. అయితే 2018 తర్వాత త్రిష స్పీడ్ తగ్గించింది.
అందుకు వ్యక్తిగత కారాణాలున్నాయా? అవకాశాలు లేక అన్నది తెలియదు గానీ మునుపటి అంత వేగాన్ని చూపించలేకపోయింది. మళ్లీ `పొన్నియన్ సెల్వన్` విజయంతో ఒక్కసారిగా పుంజుకుంది. ఈసినిమా త్రిషకి పాన్ ఇండియాలో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇదే ఉత్సాహంలో `లియో`లోనూ నటించి మరో భారీ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు..మూడు ప్రాజెక్ట్ లున్నాయి.