సౌత్ టాప్ డైరెక్టర్స్ విద్యార్హతల గురించి మీకేం తెలుసు?
ఇలా అత్యున్నత విద్యావంతులు ఇప్పుడు సౌతిండియాలో గొప్ప దర్శకులుగా వెలుగుతున్నారు.
By: Tupaki Desk | 17 Sep 2023 3:15 AM GMTనేడు పాన్ ఇండియా మార్కెట్లో సౌతిండియన్ డైరెక్టర్లదే హవా. ఇప్పటికే అరడజను మంది సౌత్ డైరెక్టర్స్ బాక్సాఫీస్ ని షేక్ చేసే పాన్ ఇండియన్ విజయాలతో మెప్పించారు. ఇందులో మణిరత్నం-ఎస్.శంకర్- ఎస్.ఎస్.రాజమౌళి- సుకుమార్- ప్రశాంత్ నీల్- లోకేష్ కనగరాజ్- అట్లీ వంటి ప్రముఖ దర్శకులు ఉన్నారు. వీరంతా ఎడ్యుకేషన్ పరంగా ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసారు. పై ఆరుగురిలో ఎస్.ఎస్.రాజమౌళి మాత్రం ఇంటర్ తర్వాత విద్యను కొనసాగించలేకపోయారు. ఆయన తన లైఫ్ ని పూర్తిగా సినిమాకే అంకితమిచ్చారు.
సౌతిండియా ఫైనెస్ట్ డైరెక్టర్స్ లో మణిరత్నం -మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఫైనాన్స్ లో డిగ్రీ పూర్తి చేసారు. బొంబాయి- పొన్నియన్ సెల్వన్ 1 & 2 చిత్రాలతో మణిరత్నం పాన్ ఇండియాలో సత్తా చాటారు. అలాగే ఎస్.శంకర్ రోబో- 2.0- అన్నియన్ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గొప్ప దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేట్. బాహుబలి- ఆర్.ఆర్.ఆర్ చిత్రాల దర్శకుడిగా రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.
ఆయన ఇంటర్మీడియట్ తర్వాత విద్య కొనసాగలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్ ప్రస్తుతం పుష్ప2తో మరోసారి సంచలనంగా మారాలని కలలు కంటున్నాడు. సుకుమార్ - మ్యాథమెటిక్స్ లో పీజీ పూర్తి చేసి మ్యాథ్స్ లెక్చరర్ గా పని చేసారు. అలాగే కేజీఎఫ్ ఫ్రాంఛైజీతో సంచలనంగా మారిన ప్రశాంత్ నీల్- బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్ మెంట్ లో పట్టభద్రుడు. విక్రమ్ తో రికార్డ్ హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - ఫ్యాషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్, ఎంబిఏ కూడా పూర్తి చేసాడు.
జవాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న అట్లీ- బిఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ పూర్తి చేసాడు. ఇటీవలే రజనీకాంత్ కి జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన నెల్సన్ దిలీప్ కుమార్- విజువల్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ - న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. గొప్ప మాటల రచయితగా స్టోరి రైటర్ గా త్రివిక్రమ్ క్రేజ్ వేరు. కన్నడ దర్శకుడు రక్షిత్ శెట్టి - సాఫ్ట్ వేర్ ఇంజినీర్. సాఫ్ట్ వేర్ కోర్సులను అభ్యసించాడు. మలయాళ స్టార్ డైరెక్టర్ కం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ -బ్యాచిలర్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పట్టభద్రుడు.
గౌతమ్ మీనన్ - మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసారు. ఉపేంద్ర- బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో పట్టభద్రుడు. కార్తీక్ సుబ్బరాజు- మెకానికల్ ఇంజినీర్ పూర్తి చేసారు. జీతు జోసెఫ్ -బ్యాచిలర్స్ ఇన్ ఎకనామిక్స్ లో నిపుణుడు. కొరటాల శివ- సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. క్రిష్ -మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ తో పాటు ఫార్మసీ లో స్టడీస్ ని పూర్తి చేసారు. అవసరాల శ్రీనివాస్- మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసారు. ఇలా అత్యున్నత విద్యావంతులు ఇప్పుడు సౌతిండియాలో గొప్ప దర్శకులుగా వెలుగుతున్నారు.