Begin typing your search above and press return to search.

టాప్ డైరెక్టర్స్… మైథాలజీ డ్రీమ్స్!

మన ఇండియన్ మైథాలజీ, హిస్టరీలో ఎన్నో వీరోచిత పోరాటాలు, గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే ఘట్టాలు, క్యారెక్టర్స్ ఉన్నాయని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   1 July 2024 4:18 AM GMT
టాప్ డైరెక్టర్స్… మైథాలజీ డ్రీమ్స్!
X

ప్రస్తుతం సినిమాల ట్రెండ్ మారింది. ఒకప్పుడు కమర్షియల్ జోనర్ లో సాగే సోషల్ కాన్సెప్ట్ లపై ఎక్కువ సినిమాలు చేసే దర్శకులు ప్రస్తుతం మైథాలజీ, హిస్టరీ మీద ఫోకస్ చేశారు. మైథాలజీ టచ్ తో వస్తోన్న కథలకి ప్రస్తుతం ప్రేక్షకాదరణ లభిస్తోంది. అందుకే దర్శక, నిర్మాతలు కూడా ఎక్కువగా వాటిపైనే ఫోకస్ చేశారు. అలాగే ఇండియన్ సినిమాకి హాలీవుడ్ స్టాండర్డ్స్ తీసుకొని రావాలన్న కూడా ఇలాంటి కథలు కీలక భూమిక పోషిస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

మన ఇండియన్ మైథాలజీ, హిస్టరీలో ఎన్నో వీరోచిత పోరాటాలు, గూస్ బాంబ్స్ క్రియేట్ చేసే ఘట్టాలు, క్యారెక్టర్స్ ఉన్నాయని చెబుతున్నారు. వాటిని ఇప్పటి విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగించుకొని తెరపై ఆవిష్కరిస్తే అద్భుతంగా ఉంటాయని సూచిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ కల్కి 2898ఏడీ మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ ని అందుకుంటుంది.

భాగవతం, కల్కిపురాణం ఆధారంగా కల్కి 2898ఏడీ సినిమాని నాగ్ అశ్విన్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఆవిష్కరించాడు. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అంతకు మించి స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ కారణంగా మంచి ఆదరణ లభిస్తోంది. అయితే భవిష్యత్తులో మైథాలజీ కథలని డ్రీమ్ ప్రాజెక్ట్స్ గా కలిగి ఉన్న దర్శకుల జాబితా చూసుకుంటే టాప్ డైరెక్టర్స్ కనిపిస్తున్నారు.

ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఈ సినిమాని సిరీస్ గా చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. అయితే ఏది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందనేది తెలియాల్సి ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథలతో సత్తా చాటుతున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ సిరీస్, సలార్ అతన్ని ఇండియన్ టాప్ డైరెక్టర్స్ జాబితాలో చేర్చాయి. నెక్స్ట్ ఎన్టీఆర్ తో మూవీ ప్లానింగ్ జరుగుతోంది. దీని తర్వాత మైథలాజికల్ కథాంశంతో ఒక స్క్రిస్ప్ ని ప్రశాంత్ నీల్ రెడీ చేసాడంట.

ప్రభాస్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయంట. ప్రభాస్ కి స్టోరీ లైన్ కూడా ప్రశాంత్ నీల్ ఇప్పటికే నేరేట్ చేసాడని టాక్ వినిపిస్తోంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి మైథాలజీ మీద మంచి పట్టుంది. ఆయన సోషల్ ఫ్యామిలీ డ్రామా కథలు చేసిన వాటిలో కూడా మైథాలజీ ఎడాప్షన్ ఉంటుంది. డైలాగ్స్ రూపంలో తనకి భారతీయ ఇతిహాసాలు, కథలపై ఉన్న ఇష్టాన్ని త్రివిక్రమ్ చూపిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే హారిక అండ్ హాసిని, సితారలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ భారీ మైథలాజికల్ మూవీ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నారంట. ఈ కథ మీద ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నారంట. ఎన్టీఆర్ ఈ మూవీలో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుత కమిట్మెంట్స్ అన్ని క్లియర్ అయ్యాక త్రివిక్రమ్ తో సినిమాని తారక్ పట్టాలెక్కించి ఛాన్స్ ఉందంట. దీనికి కనీసం ఐదేళ్లయిన పట్టొచ్చు.