Begin typing your search above and press return to search.

డాకు మహారాజ్‌ : తమన్‌ బేస్‌కి కింద పడ్డ స్పీకర్‌లు

హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో సినిమా మీడియా సమావేశంను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన స్పీకర్స్‌ తమన్ బేస్‌ కి కింద పడటంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   11 Jan 2025 8:22 AM GMT
డాకు మహారాజ్‌ : తమన్‌ బేస్‌కి కింద పడ్డ స్పీకర్‌లు
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ సినిమా రేపు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించాలని భావించారు. కానీ తిరుపతిలో జరిగిన ఘటన కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌ హోటల్‌లో సినిమా మీడియా సమావేశంను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఏర్పాటు చేసిన స్పీకర్స్‌ తమన్ బేస్‌ కి కింద పడటంతో అందరి దృష్టిని ఆకర్షించింది. తమన్‌ బేస్ వాయింపు ఈ రేంజ్‌లో ఉంది అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

డాకు మహారాజ్‌ సినిమాలోని ఒక పాటను ప్లే చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న స్పీకర్‌ షేక్ అయ్యి కింద పడి పోయింది. గతంలో బాలకృష్ణ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించిన సమయంలో స్పీకర్‌లు బద్దలు అయ్యి కొత్త స్పీకర్‌లు వేయించాల్సి వచ్చింది. స్పీకర్‌లు పగిలి పోయే స్థాయిలో మ్యూజిక్‌ను ఇవ్వడం తమన్‌కి మాత్రమే చెల్లింది. అలాంటి మ్యూజిక్‌ను మరోసారి తమన్‌ ఈ సినిమాకు ఇచ్చాడు అంటూ తాజాగా ఘటనతో వెల్లడి అయింది. స్పీకర్‌లు షేక్‌ అయ్యే స్థాయిలో డాకు మహారాజ్ సినిమా బీజీఎంతో పాటు సినిమా పాటలు ఉంటాయని తమన్‌ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే వచ్చిన టీజర్‌, ట్రైలర్‌లతో పాటు రిలీజ్‌ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా తమన్‌ మాట్లాడుతూ... బాలకృష్ణ గారితో సినిమా అంటేనే స్పీకర్‌లు బద్దలు అవుతాయి. బాలకృష్ణ గారి సినిమాకు నేను మ్యూజిక్‌ చేస్తున్నాను అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. అందుకే తాను ఆ స్థాయిలోనే మ్యూజిక్ చేస్తాను అన్నాడు. సినిమాలో బాలకృష్ణ గారి హైప్ సీన్స్ ఉండటం వల్లే నాకు మంచి మ్యూజిక్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది అని తమన్‌ అన్నాడు. ముందు ముందు మరిన్ని సినిమాలను బాలకృష్ణ గారితో చేస్తానని తమన్‌ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయెల్‌ రోల్‌లో నటించాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు నటించారు. మెయిన్‌ లీడ్‌ హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్‌ నటించగా, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రలో నటించింది. ఇక శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది అనే వార్తలు వస్తున్నాయి. నాగ వంశీ ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఇప్పటికే వచ్చిన సంక్రాంతి గేమ్‌ ఛేంజర్‌ సినిమాను ఏ విధంగా డాకు మహారాజ్ ఢీ కొడతాడు అనేది చూడాలి. బాలకృష్ణ సరికొత్త గెటప్‌తో పాటు కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చేశారు.