Begin typing your search above and press return to search.

భగవంతే కేసరి ఈవెంట్.. విజ్జి లుక్కే కాదు స్పీచ్ కూడా అదిరింది..!

ఈవెంట్ లో పాల్గొన్న మరో హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ.. ఇది తన కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా అని.. బాలకృష్ణ గారితో పనిచేయడం ఎంతో గౌరవంగా అనిపించింది.

By:  Tupaki Desk   |   9 Oct 2023 4:20 AM GMT
భగవంతే కేసరి ఈవెంట్.. విజ్జి లుక్కే కాదు స్పీచ్ కూడా అదిరింది..!
X

నందమూరి బాలకృష్ణ అనీల్ రావిపుడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ రిలీజ్ వరంగల్ లో జరిగింది. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతున్న భగవంత్ కేసరి సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ అంతా పాల్గొని ఆడియన్స్ ని అలరించారు. ఈవెంట్ లో పదహారణాల తెలుగింటి అమ్మాయిగా శ్రీ లీల పట్టుపరికిణితో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.

ఈవెంట్ లో భాగంగా శ్రీ లీల మాట్లాడుతూ.. సినిమాలో తాను వరంగల్ అమ్మాయిగా కనిపిస్తా.. ఈ సినిమాలో విజ్జి పాప పాత్ర చేశా.. అందుకే ఆ పాత్ర లుక్ తోనే ఈ వేడుకకి వచ్చానని అన్నారు శ్రీ లీల. ఈ పాత్రని దర్శకుడు అనిల్ రావిపుడి చాలా బాగా తీర్చిదిద్దారు. మనసుని తాకే పాత్ర తనకు ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్ అన్నారు. బాలకృష్ణ గారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నా.. ఈరోజు చివరి షాట్ వరకు ఆయన తనకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు.

ఈ సినిమాలో నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని.. సినిమాలు చాలా చేస్తామని మనసుకి నచ్చిన పాత్రలు చేయడం చాలా అరుదని భగవంత్ కేసరి సినిమాలో విజ్జి పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని మీ అందరికీ అది నచ్చుతుందని అన్నారు శ్రీ లీల. నా జీవితంలో ఏ అనుభవాలతే లేవో అది ఈ సినిమాతో ఇచ్చారని అన్న శ్రీ లీల ఈ సినిమాను అందరు చూసి ఆదరించాలని అన్నారు.

ఈవెంట్ లో పాల్గొన్న మరో హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ.. ఇది తన కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా అని.. బాలకృష్ణ గారితో పనిచేయడం ఎంతో గౌరవంగా అనిపించింది. ఆయన ఎంతోమందికి స్పూర్తిదాకకంగా ఉన్నారని అన్నారు. అనీల్ రావిపుడి తో వర్క్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. శ్రీ లీల ఎంతో టాలెంట్ ఉన్న నటి ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు కాజల్.

భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అనిల్ రావిపుడి మాట్లాడుతూ ఈ సినిమాకు తీసేందుకు ప్రధాన కారణమైన నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. బడ్జెట్ పరంగా మేకింగ్ పరంగా తనకు ఎంతో స్వేచ్చని ఇచ్చారని అన్నారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్య ఉంటంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారు. భగవంత్ కేసరి విజ్జి పాప మధ్య ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. శ్రీ లీల విజ్జి పాపగా చాలా బాగా చేశారు. బాలకృష్ణ ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు.

కొత్త పాత్ర వస్తే ఆయన ఓ స్టూడెంట్ లా కష్టపడి పనిచేస్తారని అన్నారు అనీల్ రావిపుడి. తను రాసిన దానికన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఆయన కష్టపడ్డారు. బాలయ్య బాబుతో ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు అనీల్ రావిపుడి. భగవంత్ కేసరి ఈ పేరు చాలా ఏళ్లు ఊఅదింటాడి అనే డైలాగ్ లాగా ఈ సినిమా తన కెరీర్ లో ఎప్పటికి గుర్తుంటుందని అన్నారు అనీల్ రావిపుడి.