Begin typing your search above and press return to search.

స్పిరిట్.. వంగా తక్కువ అంచనా వేశారేమో?

సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ కు ప్రభాస్ స్టార్ డమ్ తోడు అవుతుంది కనుక.. సినిమాపై అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   11 Dec 2024 3:30 PM GMT
స్పిరిట్.. వంగా తక్కువ అంచనా వేశారేమో?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొల్పిన ఆ మూవీ ఎప్పుడు వస్తుందోనని డార్లింగ్ తోపాటు వంగా అభిమానులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. అప్డేట్స్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అదే సమయంలో వివిధ సందర్భాల్లో సందీప్ వంగా.. మూవీ కోసం చెబుతూ ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేశారు. తన లాస్ట్ మూవీ యానిమల్ కంటే ఎక్కువ వయోలెన్స్.. స్పిరిట్ లో ఉంటుందని ఇటీవల తెలిపారు. నెవ్వర్ బెఫోర్ అనేలా.. ప్రభాస్ పోలీసు ఆఫీసర్ రోల్ లో కనిపిస్తారని చెప్పారు. అయితే స్పిరిట్ మేకర్స్.. రూ.1000 కోట్లను టార్గెట్ గా పెట్టుకున్నారని ఇప్పటికే గుసగుసలు వినిపించాయి.

ఆ తర్వాత.. ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ ఓపెనింగ్స్ గురించి మాట్లాడారు సందీప్ వంగా. తమ టార్గెట్ రూ.150 కోట్లు అన్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. పుష్ప -2 వసూళ్ల సునామీ తర్వాత.. స్పిరిట్ ఓపెనింగ్స్ గురించి సందీప్ తక్కువ అంచనా వేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్పిరిట్ ఓపెనింగ్స్ రూ.150 కోట్ల కన్నా ఎక్కువ వస్తాయని అంచనా వేస్తున్నారు.

నిజానికి.. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తొలిరోజు రూ. 220 కోట్ల గ్రాస్‌ ను వసూలు చేసిన విషయం తెలిసిందే. ఆ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యమని ఇటీవల భావించారు. కానీ పుష్ప దానిని భారీ తేడాతో బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మొదటి రోజు ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది.

ఇప్పటి వరకు నాన్ రాజమౌళి, నాన్ బాహుబలి రికార్డులు మాత్రమే ఉంటే.. ఇక నుంచి నాన్ పుష్ప 2 రికార్డులు అని అంటారు. దీంతో ఇప్పుడు పుష్ప రికార్డును స్పిరిట్ బ్రేక్ చేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్‌ ను టచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. రూ.200 కోట్ల మార్క్ ను క్రాస్ చేయడం పక్కా అని అంటున్నారు.

సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ కు ప్రభాస్ స్టార్ డమ్ తోడు అవుతుంది కనుక.. సినిమాపై అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. నార్త్ టూ సౌత్.. మంచి హైప్ క్రియేట్ అవ్వడం పక్కా. దీంతో పుష్ప -2 ఓపెనింగ్స్ రికార్డును స్పిరిట్ మూవీ బ్రేక్ చేయడం ఈజీ అని అభిప్రాయపడుతున్నారు. మరి స్పిరిట్ సినిమా విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.