Begin typing your search above and press return to search.

నా సినిమాలో హీరోయిన్ కి ఫేం..ఫాం అస‌రంలే!

కాబ‌ట్టి ఇక్క‌డ వాళ్ల అభిప్రాయం కూడా అంతే కీల‌కంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   26 Oct 2024 4:30 PM GMT
నా సినిమాలో హీరోయిన్ కి ఫేం..ఫాం అస‌రంలే!
X

ఓ సినిమాకి హీరోయిన్ సెల‌క్ట్ చేస్తున్నారంటే ఎన్నో విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. మార్కెట్ లో వాళ్ల‌కున్న డిమాండ్...స్టార్ డ‌మ్.. ఫాలోయింగ్ ...క్రేజ్ ఇలా చాలా విష‌యాలు ఆలోచించే ద‌ర్శ‌కులు ఎంపిక చేస్తుంటారు. ఇదంతా ప‌క్క‌న బెడితే ఆ సినిమాలో హీరో ఒపినీయ‌న్ కూడా తీసుకుంటారు చాలా మంది ద‌ర్శ‌కులు. హీరోగారికి హీరోయిన్ న‌చ్చ‌క‌పోతే అదో స‌మ‌స్య‌గా హైలైట్ అవుతుంది. కాబ‌ట్టి ఇక్క‌డ వాళ్ల అభిప్రాయం కూడా అంతే కీల‌కంగా ఉంటుంది.

ఎవ‌రో కొంత మంది ద‌ర్శ‌క‌లకు త‌ప్ప స్వేచ్ఛ గా హీరోయిన్ తీసుకునే ఆప్ష‌న్ అనేది అంద‌రికీ ఉండ‌దు. అందులో సందీప్ రెడ్డి వంగ ఒక‌రు. త‌న సినిమాలో హీరోయిన్ ఎంపిక అన్న‌ది పూర్తిగా త‌న‌వ‌రకే ప‌రిమితం అట‌. ఇంకెవ్వ‌రూ ఇన్వాల్వ్ కారు అన్నారు. అలాగే తాను ఎంపిక చేసే స‌మ‌యంలో ఆ హీరోయిన్ ఫేం..ఫాం విష‌యాలేవి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోడుట‌. తాను రాసుకున్న పాత్ర‌కు న‌చ్చితే మాట్లాడి మ్యాట‌ర్ క్లోజ్ చేయ‌డం త‌ప్ప ఇంకేం డిస్క‌ష‌న్స్ ఉండ‌వ‌న్నాడు.

అయితే స్టోరీ..వాళ్ల కు సంబంధించిన పాత్ర విష‌యంలో ముందే క్లారిటీ గా చెప్పేస్తారుట‌. వాస్త‌వానికి `యానిమ‌ల్` సినిమాలో ముందు హీరోయిన్ గా అనుకున్న‌ది ప‌రిణితి చోప్రాని. ఆమెతో మాట్లాడ‌టం ఒకే చేయ‌డం కూడా జ‌రిగిపోయిందిట‌. అయితే త‌న‌కే మ‌ళ్లీ ఆపాత్ర‌కు తాను సెట్ అవ్వ‌ద‌నిపించిందిట‌. దీంతో ఆమెను ఒప్పించి త‌ప్పించి ర‌ష్మిక‌ని రంగంలోకి దించిన‌ట్లు చెప్పాడు.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ కోసం స్పిరిట్ సిద్దం చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవ‌ర్ని తీసుకుంటాడో చూడాలి. ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సందీప్ రెడ్డి ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో నే ఉన్నాడు. అవ‌స‌రం మేర ముంబై వెళ్లి రావ‌డం చేస్తున్నాడు.