ప్రభాస్ 'స్పిరిట్' ఏం జరుగుతోంది?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాను అధికారికంగా ప్రకటించి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు.
By: Tupaki Desk | 21 Feb 2025 9:30 AM GMTప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో 'స్పిరిట్' సినిమాను అధికారికంగా ప్రకటించి చాలా కాలం అయింది. కానీ ఇప్పటి వరకు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. అందుకు కారణం ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం అనే విషయం తెల్సిందే. మరో వైపు దర్శకుడు సందీప్ వంగ స్పిరిట్ కోసం దాదాపు ఆరు నెలల పాటు తన టీంతో కలిసి స్క్రిప్ట్ వర్క్ చేశారు. డైలాగ్ వర్షన్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే నటీనటుల ఎంపిక సైతం పూర్తి అయిందని సమాచారం అందుతోంది.
సందీప్ రెడ్డి వంగ సన్నిహితుల నుంచి అందుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ను మే నెలలో మొదలు పెట్టబోతున్నారు. ఆ మధ్య నిర్మాత భూషన్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఆరంభంలోనే సినిమాను ప్రారంభిస్తామని అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆలస్యం అయింది. ఎట్టకేలకు సినిమా రెగ్యులర్ షూటింగ్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభించడం మాత్రమే కాకుండా, అదే నెలలో ప్రభాస్‌పై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సందీప్ వంగ పక్కా స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నారు కనుక ఆలస్యం కాకుండా షూటింగ్ త్వరలోనే ముగిసే అవకాశాలు ఉన్నాయి.
స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ పలువురిని ఎంపిక చేశారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్‌ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. వారిద్దరు దాదాపుగా 30 నుంచి 40 రోజుల పాటు డేట్లు ఇవ్వాల్సి ఉందట. వారి డేట్లకు తగ్గట్లుగానే దర్శకుడు సందీప్ వంగ షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ లేదా రష్మిక మందన్న నటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు సందీప్ వంగ ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు. వారిద్దరితో సందీప్ చర్చలు జరిపారు అనేది మాత్రం బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. త్వరలోనే హీరోయిన్ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
రాజాసాబ్, ఫౌజీ సినిమా షూటింగ్స్ స్పీడ్‌గా జరుగుతున్నాయి, రాజాసాబ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. దాంతో ఇదే ఏడాదిలో ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఫౌజీ సినిమాను సైతం ఇదే ఏడాదిలో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ చాలా స్పీడ్‌గా సినిమాలను చేస్తాడనే పేరు ఉంది. కనుక ఈ ఏడాదిలో ప్రారంభం కాబోతున్న స్పిరిట్ సినిమాను వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పిరిట్ సినిమా పాన్ ఇండియాను మించి వసూళ్లు చేయబోతున్నట్లు దర్శకుడు సందీప్ వంగ గతంలోనే ప్రకటించారు.