'స్పిరిట్' స్పెషల్ సాంగ్ ఇంట్రస్టింగ్ రూమర్!
ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 2 Dec 2024 6:50 AM GMTప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాలను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాల షూటింగ్స్ సమాంతరంగా జరుగుతున్నాయి. రాజాసాబ్ సినిమా జనవరి వరకు షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫౌజీ సినిమాను సమ్మర్ వరకు పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఆ రెండు సినిమాల షూటింగ్స్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ స్పిరిట్ సినిమా ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సందీప్ వంగ గత చిత్రాల అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో ఆయన రూపొందించిన యానిమల్ సినిమా దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. దాంతో స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు సందీప్ వంగ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర పుకారు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్పిరిట్‌లో చాలా స్పెషల్‌గా ఒక ఐటెం సాంగ్ ఉండబోతుందట. ఆ పాట కోసం ఇప్పటికే హర్షవర్ధన్ రామేశ్వర్ ట్యూన్‌ని రెడీ చేయడం జరిగిందట.
ఆ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, సౌత్‌లోనూ మంచి గుర్తింపు ఉన్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ చేయబోతుందని అంటున్నారు. స్పిరిట్‌లో హీరోయిన్ ఎవరు అనే విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటికే సినిమాలో ఐటెం సాంగ్‌ను కియారా అద్వానీతో చేయించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనే విషయమై తెలియాల్సి ఉంది. కానీ కియారా అద్వానీ వంటి స్టార్‌తో ఐటెం సాంగ్ చేయిస్తే కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా అనగానే చాలా వైల్డ్‌గా సన్నివేశాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు. యానిమల్ సినిమాలో హింస ఎక్కువ అయ్యిందని విమర్శలు వచ్చినా వసూళ్లు అదే స్థాయిలో వచ్చాయి. కనుక అస్సలు తగ్గకుండా సినిమాను భారీ ఎత్తున వైల్డ్ యాక్షన్ సీన్స్‌తో చేయాలని దర్శకుడు సందీప్ వంగ భావిస్తున్నాడు. ప్రభాస్‌ను వైల్డ్‌గా చూపిస్తే ప్రేక్షకులు ఎంత వరకు ఆధరిస్తారు అనేది చూడాలి. మొత్తానికి స్పిరిట్ సినిమా గురించిన ప్రతి అప్‌డేట్, పుకారు సినిమాపై అంచనాలను పెంచేస్తూ ఉంది అనడంలో సందేహం లేదు. మరోసారి స్పిరిట్ సినిమా గురించి వార్తలు మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.