Begin typing your search above and press return to search.

స్పిరిట్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారే..?

ట్రైన్ టూ బూసాన్, మార్వెల్ సిరీస్ ఎటర్నల్ మూవీస్ లో కీలక పాత్రలలో నటించిన లీ డాంగ్ సిక్ ని స్పిరిట్ మూవీ కోసం సంప్రదిస్తున్నారంట.

By:  Tupaki Desk   |   8 July 2024 8:02 AM GMT
స్పిరిట్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారే..?
X

డార్లింగ్ ప్రభాస్ తాజాగా కల్కి 2898ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని భాషలలో అద్భుతమైన కలెక్షన్స్ తో కల్కి దూసుకుపోతోంది. మరికొద్ది రోజుల్లో వెయ్యి కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ని కల్కి2898ఏడీ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. టికెట్ ధరల్ని తెలుగు రాష్ట్రాలలో తగ్గించడంతో మరల కలెక్షన్స్ పెరిగాయని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే ప్రభాస్ నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. టి-సిరీస్, భద్రకాళీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. 300+ కోట్ల బడ్జెట్ తో స్పిరిట్ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందంట. ఈ ఏడాది ఆఖరులో సందీప్ రెడ్డి వంగా సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే స్పిరిట్ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగానే తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అందుకోసమే మూవీలో ప్రభాస్ కి ప్రతినాయకుడిగా హాలీవుడ్ లో రాణిస్తున్న సౌత్ కొరియన్ యాక్టర్ ని ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైన్ టూ బూసాన్, మార్వెల్ సిరీస్ ఎటర్నల్ మూవీస్ లో కీలక పాత్రలలో నటించిన లీ డాంగ్ సిక్ ని స్పిరిట్ మూవీ కోసం సంప్రదిస్తున్నారంట. మూవీ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ లెవల్ లో ఉండబోతోందంట. అందుకోసమే హాలీవుడ్ యాక్టర్ ని ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్ లో లీ డాంగ్ సిక్ ని నటుడిగా మంచి పేరుంది. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే మూవీ రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇదిలా ఉంటే మూవీలో ప్రభాస్ రెండు భిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడనే మాట వినిపిస్తోంది. ఒక లుక్ ఫుల్ మాస్ రఫ్ అండ్ రగ్గడ్ గా ఉంటుందంట. ఈ లుక్ ప్రేక్షకులని సర్ప్రైజ్ చేస్తుందంట. మరో లుక్ లో సూపర్ స్టైలిష్ అవతార్ లో కనిపిస్తాడంట. హాలీవుడ్ హీరో రేంజ్ లో ఈ క్యారెక్టర్ లుక్ ఉంటుందనే మాట వినిపిస్తోంది.

సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని గతంలో సందీప్ చెప్పాడు. అయితే ఇప్పుడు లుక్ వేరియేషన్ దేనికోసం అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ డ్యూయల్ రోల్ లో ప్రభాస్ కనిపిస్తాడా లేదంటే ఒకే వ్యక్తిని రెండు భిన్నమైన లుక్స్ లో రిప్రజెంట్ చేస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.