Begin typing your search above and press return to search.

వ‌ర‌ల్డ్ మోస్ట్ పాపుల‌ర్ సిరీస్.. మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది.. టీజర్ ఇదిగో..

టీజ‌ర్​ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్​. ఈ రియాలిటీ సిరీస్​లో $4.56 మిలియన్ల ప్రైజ్ మనీ కోసం 456 మంది కంటెంస్టెంట్​లు పోటీ పడుతున్న‌ట్లుగా టీజర్ చూపించారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 11:30 PM GMT
వ‌ర‌ల్డ్ మోస్ట్ పాపుల‌ర్ సిరీస్.. మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది.. టీజర్ ఇదిగో..
X

ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు ఎక్కువగా చూసేవారికి పరిచయం అక్క‌ర్లేని లేని పేరు స్క్విడ్ గేమ్. మనీ హెయిస్ట్, స్ట్రేంజర్ థింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి సిరీస్, సినిమాలకు ఏ రేంజ్ పాపులారిటీ అయిందో ఉందో.. ఈ స్క్విడ్ గేమ్​కు కూడా అంతే. క్షణక్షణం ఉత్కంఠ గొలిపేలా ప్రేక్షకులకు ఎంతో థ్రిల్ కలిగించిందీ సిరీస్. 2021లో నెట్‍ఫ్లిక్స్​లో వచ్చిన ఈ స్క్విడ్ గేమ్‍కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కింది. వరల్డ్ మోస్ట్ పాపులర్ సిరీస్‍గా నిలిచింది.

ఈ రేంజ్​లో మోస్ట్​ పాపులర్ అయిన ఈ స్క్విడ్ గేమ్ సిరీస్​ రెండో సీజన్​ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓటీటీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇది చాలా ఆలస్యమైనప్పటికీ.. ఎట్టకేలకు వచ్చేందుకు సిద్ధం అయింది. ఇప్పుడు రెండో సీజన్ గురించి ఓ కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్​. ఈ రెండో సీజన్ స్క్విడ్ గేమ్​ ది చాలెంజ్ రియల్ సిరీస్ పేరుతో రాబోతున్నట్లు పేర్కొన్నారు.

టీజ‌ర్​ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్​. ఈ రియాలిటీ సిరీస్​లో $4.56 మిలియన్ల ప్రైజ్ మనీ కోసం 456 మంది కంటెంస్టెంట్​లు పోటీ పడుతున్న‌ట్లుగా టీజర్ చూపించారు. నవంబర్ 22 నుంచి ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు అనౌన్స్ చేశారు. ఇది బిగ్గెస్ట్ కాంపిటీషన్ సిరీస్ అని కూడా రాసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే.. ఈ సారి స్క్విడ్ గేమ్‍లో మరికొన్ని కొత్త డిఫరెంట్ గేమ్స్ ఉండనున్నట్లు అర్థమవుతోంది.

ఇకపోతే మొదటి సీజన్‌లో కనిపించిన లీ జంగ్ జే, వి హా జున్, లీ బ్యుంగ్ హున్, గాంగ్ యూ.. రెండో సీజన్‌లో కూడా నటించనున్నారు. వీరితో పాటు కాంగ్ హా న్యూల్, యిం సి వాన్, యాంగ్ డాంగ్ గ్యూన్, పార్క్ సంగ్ హూన్ ఈ రెండో సీజన్​లో కొత్తగా కనిపించనున్నారు. హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహిస్తున్నారు. ది గార్డెన్ అండ్ స్టూడియో లాంబర్ట్ ద్వయం నిర్మిస్తున్నారు.

కాగా, స్క్విడ్ గేమ్ సీజన్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. కేవలం 28 రోజుల్లోనే 1.65 బిలియన్ గంటల వ్యూయర్ షిప్‌ దక్కించుకోవడం విశేషం. అంటే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది యూజర్లు చూశారు. అంతేకాదు పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డుల్లో ఏకంగా 14 నామినేషన్లను పొంది... ఆరు అవార్డులను ముద్దాడింది. అయితే ఈ సిరీస్‌లో వైలెన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు బాగానే చేరువైంది. ఈ గేమ్‍లో ఎలిమినేషన్ అంటే కంటెస్టెంట్లను చంపడమే. ఇక రెండో సిరీస్ ఎలా ఉండబోతుందో..