Begin typing your search above and press return to search.

స్రవంతి చొక్కారపు.. గ్లామర్ కాంబినేషన్లో స్టన్నింగ్ స్మైల్

తాజాగా, స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లెహంగాలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   27 Nov 2024 4:56 PM GMT
స్రవంతి చొక్కారపు.. గ్లామర్ కాంబినేషన్లో స్టన్నింగ్ స్మైల్
X

తెలుగు టెలివిజన్ రంగంలో ఎంతమంది యాంకర్స్ ఉన్నా కూడా అందులో గ్లామరస్ యాంకర్స్ గా మంచి గుర్తింపు అందుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. ఇక ఆ లిస్టులో స్రవంతి చొక్కారపు తన ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకుంది. యూట్యూబ్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన స్రవంతి, అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులను ఆకర్షించే యాంకరింగ్ ప్రతిభతో తానేంటో నిరూపించుకుంది.

ఆమె హోస్ట్ చేసిన అనేక షోలు సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఆమె ‘ఫ్యామిలీ స్టార్స్’ షోలో యాంకర్‌గా మెరిస్తోంది. తాజాగా, స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లెహంగాలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ డ్రెస్ డిజైనింగ్, రంగుల ఎంపిక ఆమె అందాన్ని మరింతగా హైలైట్ చేస్తూ, ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి.

ముఖ్యంగా ఆమె ధరించిన ఆభరణాలు, కూర్చిన జడ, మరియు క్యాజువల్ యెట్ గ్లామరస్ లుక్ ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. స్రవంతి అందం మాత్రమే కాదు, ఆమె కలిగిన కాన్ఫిడెన్స్ కూడా ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ ఫోటోలలో ఆమె ఇచ్చిన ‘Don’t chase, just attract’ కామెంట్ పాజిటివ్ యాటిట్యూడ్‌ను స్పష్టంగా తెలియజేస్తోంది. వృత్తిలో తనకంటూ ఒక స్థానం సాధించడంలో ఈ కాన్ఫిడెన్స్ ఆమెకు ఎంతో తోడ్పడింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో స్రవంతి యాక్టివ్‌గా ఉండడం, తన ఫ్యాషన్ స్టేట్మెంట్ ద్వారా ట్రెండింగ్‌ను సృష్టించడం ఒక ప్రత్యేక విశేషం. ఈ ఫోటోషూట్‌లో ఆమె ఫ్యాషన్ స్టైల్ మాత్రమే కాదు, తన అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆమె కెరీర్ విషయానికి వస్తే, యూట్యూబ్‌లో ప్రారంభమైన ప్రయాణం త్వరగానే టెలివిజన్ యాంకరింగ్‌కి దారితీసింది. ఇక ఈ డ్రెస్‌లోని అందం ఆమెకు కొత్త ఫ్యాన్ బేస్‌ను సృష్టిస్తుందనడంలో సందేహం లేదు. ఇక నెక్స్ట్ వెండితెరపై ఏమైనా ఛాన్సులు అందుకుంటుందేమో చూడాలి.