చిరిగిన జీన్స్ లో తెలుగు యాంకర్ బోల్డ్ లుక్
తాజాగా క్యాజువల్ జీన్స్ అండ్ టీషర్ట్ లో ధరించింది. క్యాజువల్ టీషర్ట్ కి టోన్డ్ జీన్స్ తో పెయిర్ చేసింది.
By: Tupaki Desk | 11 Aug 2023 9:48 AM GMTతెలుగు హాట్ యాంకర్ లలో సవ్రంతి చుక్కారపు కూడా ఒకరు. అనసూయ, రష్మి తర్వాత అందాలు ఆరబోయడంలో స్రవంతి పేరు ముందుగా వినపడుతుంది. ఈ రాయలసీమ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. చిన్న సినిమాల రిలీజ్ ఫంక్షన్స్ ని ఎక్కువగా ఈమె హోస్ట్ చేస్తూ ఉంటుంది.
స్రవంతి సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా క్లీవేజ్ సొగసులతో ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా క్యాజువల్ జీన్స్ అండ్ టీషర్ట్ లో ధరించింది. క్యాజువల్ టీషర్ట్ కి టోన్డ్ జీన్స్ తో పెయిర్ చేసింది. ఈ రోజుల్లో టోన్డ్ జీన్స్ ధరించడం చాలా కామన్. ఆమె కూడా అదే చేసింది.
దానికి ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. తనను హాట్ మెస్ గా పిలవాలని, కానీ ఫ్యాషన్ డిజాస్టర్ గా మాత్రం పిలవద్దూ అంటూ క్యాప్షన్ పెట్టింది. అయితే, ఆమె ప్యాంట్ విషయంలో ఆమెను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. అది ఫ్యాషన్ అని తెలిసినప్పటికీ ఆమెను ఇన్ డైరెక్ట్ గా ట్రోల్ చేయడం గమనార్హం.
ప్యాంట్ ని ఎలుకలు తిన్నాయా అని కొందరు కామెంట్ చేయగా, తాము చినిగిందని ప్యాంట్ పడేశామని, నీ ప్యాంట్ చూశాక మళ్లీ వేసుకుంటాం అని కొందరు కామెంట్ చేయడం గమనార్హం. చాలా మంది ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ని కించపరుస్తూ కామెంట్స్ చేసినా, కొందరు మాత్రం సపోర్ట్ గా నిలిచారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఆమె ఛాయిస్ కదా అని సపోర్ట్ గా నిలవడం విశేషం.
ఇదిలా ఉండగా, స్రవంతి బిగ్ బాస్ ఓటీటీలోనూ సందడి చేసింది. అయితే, ఎక్కువ కాలం ఉండలేదు. తొందరగా ఎలిమినేట్ అయ్యారు. ఇక, స్రవంతి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. సందర్భం వచ్చిన ప్రతిసారీ తన అభిమానం చూపిస్తూనే ఉంటుంది. తన కొడుక్కి కూడా పవన్ కుమారుడు అకీరా పేరే పెట్టుకోవడం విశేషం.