Begin typing your search above and press return to search.

పొట్టి గౌనులో యాంకర్ పాప.. ఎంత అందంగా ఉందొ..

బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే ఆమె తన ప్రత్యేకమైన వినోదంతో, అద్భుతమైన గేమ్ ప్లేతో ప్రేక్షకుల మనసును దోచుకుంది.

By:  Tupaki Desk   |   21 Jun 2024 4:10 AM GMT
పొట్టి గౌనులో యాంకర్ పాప.. ఎంత అందంగా ఉందొ..
X

స్రవంతి చొక్కారపు, బిగ్ బాస్ షోకు వెళ్లాక తెలుగులో బాగా పాపులర్ అయిన నటి. ఆమె ఎవరో అంతకుముందు వరకు చాలా మందికి తెలియదు, కానీ బిగ్ బాస్ ఆమ్స్ జాతకాన్ని మార్చేసింది. ఇప్పుడు ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒక స్థానం సంపాదించుకుంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే ఆమె తన ప్రత్యేకమైన వినోదంతో, అద్భుతమైన గేమ్ ప్లేతో ప్రేక్షకుల మనసును దోచుకుంది.


షోలో ఉన్నప్పుడు అమ్మడికి పెళ్లి అయ్యిందని ఎవరు ఊహించలేదు. కానీ తనకు పెళ్లి అయిందని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కానీ, ఆమె గ్లామర్ మరియు స్ట్రాటజీతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. బిగ్ బాస్ షో పూర్తయిన తరువాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ సంఖ్య గట్టిగానే పెరిగింది.


తన అభిమానులను అలరించడానికి స్రవంతి ఎల్లప్పుడూ కొత్త విషయాలు ప్రయత్నిస్తోంది. పెళ్లైనప్పటికీ ఆమె అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రతీ రోజు తన గ్లామర్ షోతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ మరియు చీరలతో ఫోటోలు దిగుతూ వాటిని పోస్ట్ చేస్తోంది. తాజా ఫోటోషూట్లలో స్రవంతి స్టైలిష్ లుక్స్‌తో మెరిసిపోతోంది.


రీసెంట్‌గా పొట్టి గౌనులో స్టైలిష్ టాప్‌లో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె చిరునవ్వుతో అభిమానులను ఆకట్టుకుని, లైకులు మరియు కామెంట్లతో నిండిపోతుంది. దానికి తోడు ఆమె తన చిరునవ్వు తోనే మరింత అందంగా కనిపిస్తోంది. ఆమె ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా అందంగా ఉంటుంది అని మరోసారి రుజువు చేసింది. స్రవంతి ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్‌గా కూడా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది.


అప్పట్లో అమ్మడు పుష్ప మూవీ ఇంటర్వ్యూలో ఆమె రాయలసీమ యాసలో మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆమె సూపర్ క్రేజ్ సంపాదించింది, బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు స్రవంతికి సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.


యాంకర్‌గా మరియు హీరోయిన్‌గా తానూ పరిశ్రమలో రాణించే అవకాశాలను వినియోగించుకుని, మరింత ఎదుగుదలను సాధిస్తుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే స్రవంతి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఆమె పోస్ట్ చేసే పోటోలను చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో యాంకర్‌గా చేస్తూ బిజీగా గడుపుతోంది.