స్రవంతి.. ఏ చీరలో అయినా చక్కదనమే!
రెండున్నరేళ్ల క్రితం.. అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ ను ఇంటర్వ్యూ చేసింది స్రవంతి.
By: Tupaki Desk | 17 Jun 2024 12:30 AM GMTకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాంకర్ స్రవంతి చొక్కారపు పేరు ఓ రేంజ్ లో వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆమె పిక్స్, షార్ట్స్ కనిపిస్తున్నాయి. యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన స్రవంతి.. తన గ్లామర్ తో పాటు మాటలతో తక్కువ టైమ్ లోనే పాపులర్ అయింది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప మూవీ ఇంటర్వ్యూతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది.
రెండున్నరేళ్ల క్రితం.. అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ ను ఇంటర్వ్యూ చేసింది స్రవంతి. ఆ సమయంలో ఆమె యాసకు వారిద్దరు ఫిదా అయ్యారు. ఇక స్రవంతి అప్పుడు ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. పలు షోలకు యాంకర్ గా చేస్తూ ఇంకొంత ఫేమస్ అయింది. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టే ఛాన్స్ కొట్టేసింది. ఇక బిగ్ బాస్ లో తన గ్లామర్ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది స్రవంతి చొక్కారపు.
హౌస్ లో తన ఆటతో ఓ రేంజ్ లో అలరించిన అమ్మడు.. టైటిల్ గెలవకపోయినా వేరే లెవల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. హౌస్ నుంచి బయటకొచ్చాక ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడింది. పెళ్లైనప్పటికీ స్కిన్ షో చేస్తూ రోజురోజుకు ఫేమస్ అయిపోతోంది. ఈ మధ్య గ్లామర్ గేట్లు ఎత్తేసి అందాల ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త పిక్స్ పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. అందాల వడ్డింపు అంటే ఏంటో రుచి చూపిస్తోంది.
పొట్టి పొట్టి డ్రెస్సులతో పాటు శారీల్లో కూడా మాయ చేస్తోంది స్రవంతి చొక్కారపు. తాజాగా స్కై బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్ శారీ కట్టుకుని దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది. చీరకు తగ్గట్టు మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని అందాలను వడ్డించింది. సింపుల్ చెయిన్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫిదా చేసింది. "మీరు పని చేయగలిగే గొప్ప ప్రాజెక్ట్ మీరే. మీ సమయాన్ని వెచ్చించండి. మేజిక్ సృష్టించండి" అంటూ క్రేజ్ క్యాప్షన్ ఇచ్చింది. ఓ షోకు ఇలా రెడీ అయినట్లు చెప్పింది.
ప్రస్తుతం స్రవంతి పిక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆమె అందంతోపాటు నవ్వుకు క్లీన్ బౌల్డ్ అయ్యామని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఏ ఔట్ ఫిట్ అయినా చక్కనమ్మ అందమే అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. మేడమ్ సర్ మేడమ్ అంతే అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అందానికి ఇమేజ్ స్రవంతి అని చెబుతున్నారు. మొత్తానికి వరుస షోస్, ప్రోగ్రామ్స్ తో దూసుకెళ్తున్న స్రవంతి.. ఫ్యూచర్ లో ఇంకెలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.